Allu Arjun:తెలుగు నటులకు జాతీయ పురస్కారం గత ఏడు దశాబ్దాలుగా అందని ద్రాక్షగా మారింది. దీంతో మన వాళ్లు ఇక అవార్డుని సాధించలేరా?..,మనకు అవార్డులు రావా? అనే చర్చ సర్వత్రా మొదలైంది. ఏడు దశాబ్దాలు గడుస్తున్నా తెలుగు నటుడికి జాతీయ పురస్కారం అన్నది ఓ కలగానే మిగిలిపోయింది. ఇక ఇప్పట్లో మన వాళ్లని ఈ అవార్డు వరించడం కష్టమన్నారు..
Allu Arjun:తెలుగు నటులకు జాతీయ పురస్కారం గత ఏడు దశాబ్దాలుగా అందని ద్రాక్షగా మారింది. దీంతో మన వాళ్లు ఇక అవార్డుని సాధించలేరా?..,మనకు అవార్డులు రావా? అనే చర్చ సర్వత్రా మొదలైంది. ఏడు దశాబ్దాలు గడుస్తున్నా తెలుగు నటుడికి జాతీయ పురస్కారం అన్నది ఓ కలగానే మిగిలిపోయింది. ఇక ఇప్పట్లో మన వాళ్లని ఈ అవార్డు వరించడం కష్టమన్నారు.. అసాధ్యం అని కామెంట్లు చేశారు. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి అనితర సాధ్యుడుగా నిలిచారు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అల్లు వారి వారసుడిగా ఇండస్ట్రీలోకి ప్రవేశించినా తనని తాను నిరూపించుకోవడం కోసం కష్టపడ్డాడు. డాన్స్ రాదంటే ఆ డాన్స్కే ఐకాన్ అయ్యాడు. స్టెప్పులు నేర్చుకున్నాడు. నటరాదన్నారు.. కసితో ముందుకు సాగాడు. ఇప్పుడు `పుష్పరాజ్`తో విజేత అయ్యాడు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు.
ఏడు దశాబ్దాల నిరీక్షణకు తెర…
ఎన్నాళ్లో వేచిన ఉదయం..ఈ నాడే నిజమైంది..అన్నట్టుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీరని తీరని కలగా మిగిలి అనుక్షణం వేధిస్తున్న ఆ బాధని పుష్పరాజ్ తీర్చేశాడు. అనుకున్నది సాధించి తెలుగు వాళ్లు కూడా జాతీయ ఉత్తమ నటులే అని నిరూపించాడు అల్లు అర్జున్. దీంతో యావత్ తెలుగు ఇండస్ట్రీతో పాటు తెలుగు రాష్ట్రాలు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇన్నేళ్లు కలగా మిగిలిపోయి..ఇక మనకు కష్టమే అనుకున్న జాతీయ పురస్కారాన్ని దక్కించుకోవడమే కాకుండా తెలుగు సినీ చరిత్రలో తొలిసారి జాతీయ పురస్కారానికి ఎంపికైన తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ రికార్డు సాధించాడు. 70 ఏళ్ల నిరీక్షణకు తెర దించాడు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా అనితర సాధ్యమైన ఫీట్‌ని సాధించి తెలుగు హీరోల్లో అసాధ్యుడు అనిపించుకున్నాడు.
పుష్ప` చిత్రంలో పోషించిన ఊర మాస్ క్యారెక్టర్ పుష్పరాజ్‌తో జాతీయ పురస్కారాన్ని బన్నీ సొంతం చేసుకోవడం విశేషం. ఏ ముహూర్తాన `నీ యవ్వ తగ్గేదేలే` అని డైలాగ్ చెప్పాడో కానీ జాతీయ పురస్కారాల్లో ఉత్తమ నడుడి అవార్డు విషయంలోనూ అదే స్టైల్లో ఎక్కడా తగ్గకుండా పురస్కారాన్ని ఎగరేసుకుపోయాడు. ఇన్నాళ్లూ ఏ నటుడికీ దక్కని అవార్డుని బన్నీ సాధించడంతో యావత్ ఇండస్ట్రీ అల్లు అర్జున్‌కు బ్రహ్మరథం పడుతోంది.
ఆ ఘనతను సాధించిన `ఒకే ఒక్కడు`…
తెలుగు సినిమా అంటే ఎన్టీఆర్, ఏ ఎన్నార్, చిత్తూరు నాగయ్య..పర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, శోభన్‌బాబు… వీరంతా తొలి తరం నటులు. నటనకు సరికొత్త భాష్యం చెప్పారు. అయితే నాటి తరం నుంచి నేటీ తరం స్టార్ హీరోల వరకు ఎవరికి వారే నటన పరంగా, పాత్రల పరంగా ప్రత్యేకతను చూపిస్తూ అశేఫష ప్రేక్షకాభిమానుల్ని అలరిస్తున్నా ఏ ఓక్కరు కూడా ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారాన్ని దక్కించుకోలేకపోయారు. ఏడు దశాబ్దాల కాలంగా తెలుగు నటులకు అందని ద్రాక్షగా మారిన జాతీయ పురస్కారాన్ని సాధించిన అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన నటుడిగా అరుదైన ఘనతని సాధించారు. టాలీవుడ్ నుంచి ఈ ఘనతని సాధించిన ఒకే ఒక్కడుగా నిలిచారు. ఇరతర భాషలకు చెందిన హేమా హేమీలు పోటీపడినా వాళ్లందరినీ వెనక్కి నెట్టి పుష్పరాజ్ అవార్డుని సొంతం చేసుకుని తెలుగు వారి 70 ఏళ్ల కలని నిజం చేశారు.
చిరు సినిమాతో ఎంట్రీ…
మెగాస్టార్ చిరంజీవి నటించిన `డాడీ` సినిమాలోని ఓ డాన్స్ రిహార్సల్స్ బిట్లో కనిపించారు బన్నీ. ఈ చిన్న షాట్‌లోనే తనదైన డాన్స్‌తో మెస్మరైజ్ చేయడమే కాకుండా ఫ్యూచర్ స్టార్ అవుతాడనే సంకేతాల్ని అందించాడు. అయితే తొలి సినిమాతో మాత్రం విమర్శలు ఎదుర్కొన్నాడు. `గంగోత్రి` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు బన్నీ. అయితే ఆ సినిమాతో వారసుడిగా అవకాశాలు పొందగలడు కానీ నటన మాత్రం నేర్చుకోలేడనే విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో నటనపై దృష్టి పెట్టాడు. లుక్ విషయంలోనూ జాగ్రతలు తీసుకోవడం, స్టైల్ పరంగానూ టాలీవుడ్ ప్రేక్షకులకు కొత్త స్టైల్‌ని పరిచయం చేయడం వంటివి చేశాడు. దాన్స్ రాదంటే డాన్స్ ఐకాన్ అనిపించుకున్నారు. నటనరాదంటే కసిగా నటన నేర్చుకున్నారు.
ఇది నేను చేయలేను అన్న క్యారెక్టర్ని ఎంచుకుని పుష్పరాజ్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఎక్కడా తగ్గేదిలే అనే స్థాయిలో ఆ పాత్రని రక్తికట్టించాడు. ఓ కూలోడిగా పక్కా మాస్ పాత్రలో మాసిన బట్టలు ధరించి బన్నీ కనిపించిన తీరు, ఆ పాత్ర కోసం తనని తాను మార్చుకుని, నడక, నటన, ఆహార్యం, డైలాగ్ డెలివరీ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. చిత్తూరు యాసలో మాట్లాడటం కోసం ఆ నేటీవిటీని పట్టుకోవడం కోసం ప్రత్యేకంగా ఓ ట్యూటర్ని పెట్టుకుని మరీ యాస నేర్చుకున్నారంటే బన్నీ ఈ పాత్ర కోసం ఎంతగా ప్రాణం పెట్టారో అర్థం చేసుకోవచ్చు. ఆ అకుంఠిత శ్రమే ఆయనని ఇప్పుడు అనితర సాధ్యుడిగా నిలబెట్టి ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారాన్ని అందుకునేలా చేసింది. స్టైల్‌కే ఐకాన్‌గా నిలచిన బన్నీ తనకు పూర్తి భిన్నంగా కూలోడిగా నటించి జాతీయ అవార్డుని దక్కించుకుని అందరికి ఆదర్శంగా నిలిచారు. ఇరవై ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన బన్నీ `పుష్ప`తో పరిపూర్ణ నటుడు అనిపించుకోవడం విశేషం.