Allu Arjun As Chief Guest For Urvashivo Rakshasivo Success Meet: అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్ జంటగా రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఉర్వశివో రాక్షసివో.
Allu Arjun As Chief Guest For Urvashivo Rakshasivo Success Meet: అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్ జంటగా రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఉర్వశివో రాక్షసివో. ఈ శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. చాలా గ్యాప్ తరువాత అల్లు శిరీష్ ఇంతటి విజయం అందుకున్నాడు. ఇకపోతే ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టడంతో చిత్ర బృందం ఆదివారం ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఈ ఈవెంట్ కు శిరీష్ అన్న, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా రాబోతున్నారు. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆదివారం సాయంత్రం జేఆర్సి కన్వెన్షన్ హాల్ లో నిర్వహించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక తమ్ముడి సక్సెస్ ను తాను ఎంజాయ్ చేయడానికి అల్లు అర్జున్ తానే ఈవెంట్ కు వస్తున్నట్లు తెలిపాడని టాక్. ఏదిఏమైనా తమ్ముడి మొదటి సక్సెస్ ను సెలబ్రేట్ చేయడానికి వస్తున్న అన్న.. ఎలాంటి స్పీచ్ ఇచ్చి తమ్ముడికి బెస్ట్ విషెస్ తెలుపుతాడో చూడాలి.