బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తాతయ్య నరేంద్ర రజ్దాన్ నేడు కన్నుమూశారు. గ
బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తాతయ్య నరేంద్ర రజ్దాన్ నేడు కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా వయో వృద్ధాప్య సమస్యలతో పోరాడుతున్న ఆయనకు ఆరోగ్యం మరీ క్షీణించడంతో వారం రోజుల క్రితం ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఆయన మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన వయస్సు 93. ఇక తాతయ్య మరణంపై అలియా ఎమోషనల్ అయ్యింది. తాతయ్యతో గడిపిన ప్రతి క్షణాన్ని ఆమె గుర్తుచేసుకుంటూ.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
తాతయ్య బర్త్ డే సెలబ్రేట్ చేసిన ఒక వీడియోను షేర్ చేస్తూ.. ” మా తాతయ్య.. నా హీరో. ఆయన వయస్సు 93 .. ఈ వయస్సులో కూడా ఆయన గోల్ఫ్ ఆడారు. వారం క్రితం వరకు కూడా మీరు పనిచేశారు. నాకు మంచి ఆమ్లెట్ తయారుచేసి ఇచ్చారు. కథలు చెప్పేవాడివి, వయోలిన్ వాయించేవాడివి.. నీ మునిమనవరాలితో ఆడుకోనేవాడివి.. ఇక నువ్వు క్రికెట్ ఆడే విధానం.. స్కెచ్ లు వేసి ఇవ్వడం నాకు ఎంతో నచ్చేవి. చివరివరకు కుటుంబాన్నే ప్రేమిస్తూ వచ్చావు. ఆ కుటుంబం కోసమే బ్రతికావు. ఇప్పుడు నువ్వు లేవన్న బాధతో నా మనసు నిండిపోయింది. అయినా మా కోసం నువ్వు చేసిన త్యాగాలను మేము గుర్తు ఉంచుకుంటాం.. మళ్లీ మనం కలిసేవరకూ ఆ జ్ఞాపకాలను భద్రపరుచుకుంటాం” అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వార్త తెలియడంతో అలియా తాతయ్యకు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.