Ali Invites Chiru To Her Daughter's Wedding: కమెడియన్ ఆలీ కుమార్తె వివాహం ఈ నెల 27 న జరగనున్న విషయం తెల్సిందే. ఆలీ కూతురు ఫాతిమాకు, డాక్టర్ షహనాజ్ తో ఇటీవలే నిశ్చితార్థం జరుగగా పలు సినీ ప్రముఖులు ఈ వేడుకకు వచ్చి కొత్త జంటను ఆశీర్వదించి వెళ్లారు.
Ali Invites Chiru To Her Daughter’s Wedding: కమెడియన్ ఆలీ కుమార్తె వివాహం ఈ నెల 27 న జరగనున్న విషయం తెల్సిందే. ఆలీ కూతురు ఫాతిమాకు, డాక్టర్ షహనాజ్ తో ఇటీవలే నిశ్చితార్థం జరుగగా పలు సినీ ప్రముఖులు ఈ వేడుకకు వచ్చి కొత్త జంటను ఆశీర్వదించి వెళ్లారు. ఇక పెళ్లి దగ్గరపడడంతో ఆలీ పెళ్లి పనులను వేగవంతం చేశాడు. ఇప్పటికే పెళ్లి పత్రికను సీఎం జగన్ కు, గవర్నర్ తమిళసై కు అందించి కుమార్తె పెళ్ళికి రావాల్సిందిగా కోరాడు.
ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవిని ఆలీ దంపతులు కలిశారు. తమ కుమార్తె పెళ్ళికి తప్పకుండా విచ్చేయాలని పెళ్లి పత్రికను ఇచ్చి ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక చిరు సైతం తప్పకుండా పెళ్ళికి హాజరవుతానని చెప్పినట్లు వినికిడి. ఆలీ ఇంట్లో జరుగుతున్న మొదటి శుభకార్యం కావడంతో అంగరంగ వైభవంగా ఈ పెళ్లిని జరపనున్నారట. సినిమా ఇండస్ట్రీ మొత్తం తరలి రానున్నదట.