NTR Centenary:స్వర్గీయ నందమూరి తారక రామారావు (NT Ramarao) శత జయంతి ఉత్సవాలు శనివారం హైదరాబాద్ కెపీహెచ్బిలోని కైతలాపూర్ గార్డెన్స్‌లో అతిరథ మహారధుల మధ్య వైభవంగా జరిగాయి.
Akkineni v/s namdamuri balakrishna:స్వర్గీయ నందమూరి తారక రామారావు (NT Ramarao) శత జయంతి ఉత్సవాలు శనివారం హైదరాబాద్ కెపీహెచ్బిలోని కైతలాపూర్ గార్డెన్స్‌లో అతిరథ మహారధుల మధ్య వైభవంగా జరిగాయి. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయడు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, నందమూరి బాలకృష్ణ, వెంకటేష్, రామ్ చరణ్‌తో పాటు అక్కినేని ఫ్యామిలీ నుంచి సుమంత్, నాగచైతన్య పాల్గొన్నారు. ఈ కలయిక ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. బాలకృష్ణతో కొంత కాలంగా అక్కినేని ఫ్యామిలీకి మధ్య వివాదం నడుస్తోంది.
ఆ మధ్య `వీర సింహారెడ్డి` ఫంక్షన్లో బాలకృష్ణ `అక్కినేని తొక్కినేని` అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం..దానికి ఫ్యాన్స్ మండిపడటం.. వెంటనే నాగచైతన్య, అఖిల్ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ కావడం తెలిసిందే. బాలకృష్ణ, నాగార్జున మధ్య కొంత కాలంగా వివాదం నడుస్తోందని ప్రచారం జరుగుతున్న వేళ బాలకృష్ణ చేసిన `అక్కినేని తొక్కినేని` వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపాయి. బాలకృష్ఱ క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ అక్కినేని అభిమానులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Naga Chaitanya And Balakrishna
బాలయ్యపై పరుష పదజాలంతో నెట్టింట విమర్శలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఆ తరువాత బాలకృష్ణ తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ ఎవరినీ కించపరచాలన్న ఉద్దేశ్యంతో తాను అలా మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ శాంతించారు. ఈ వివాదం నేపథ్యంలో శనివారం జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో నాగార్జున ఫ్యామిలీ నుంచి యంగ్ హీరోలు నాగచైతన్య, సుమంత్ పాల్గొనడం, వేదికపై నాగచైతన్య మాట్లాడుతూ ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం..కృష్ణుడు, రాముడి గురించి ఎవరు మాట్లాడినా నాకు గుర్తొచ్చేది ఎన్టీఆర్‌గారే..` అని చెప్పడం పక్కనే బాలకృష్ణ ఆ మాటలు వింటూ మురిసిపోవడం ఆకట్టుకుంటోంది.
చైతూ స్పీచ్ అనంతరం బాలకృష్ణ ఆత్మీయంగా దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకున్న తీరు అభిమానుల్లో చర్చగా మారింది. బాలయ్య అభిమానులు మా బాలయ్య గ్రేట్ అని ప్రశంసలు కురిపిస్తుంటే అక్కినే ఫ్యాన్స్ చైతూ చాలా అద్భుతంగా మాట్లాడాడు అని, అతనిలో ఎలాంటి కల్మషం లేదని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఈవెంట్‌తో బాలయ్య, అక్కినేని నాగార్జున మధ్య ఉన్న విబేధాలు తొలగినట్టేనని నెట్టింట చర్చ జరుగుతోంది.
త్వరలో జరగనున్న మరో ఈవెంట్లో చిరంజీవితో పాటు నాగార్జున కూడా పాల్గొని వివాదానికి శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మే 28న అత్యంత భారీ స్థాయిలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా శతి జయంతి ముగింపు ఉత్సవాలు జరగనున్నాయని, ఆ వేడుకల్లో భారీ స్థాయిలో సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు పాల్గొననున్నారని తెలుస్తోంది.