Sushanth: మెగా ఆఫర్ పట్టేసిన అక్కినేని హీరో..?
Akkineni Hero Sushanth In Bhola Shankar Film: అక్కినేని హీరోల్లో సుశాంత్ ఒకడు. ప్రస్తుతం హీరోగానే కాకుండా మంచి మంచి పాత్రల్లో కనిపించి మెప్పిస్తున్నాడు. ఇప్పటికే రావణాసుర చిత్రంలో సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. తాజాగా సుశాంత్ మెగా ఆఫర్ అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడట. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరు సరసన తమన్నా నటిస్తుండగా.. చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తోంది.
ప్రస్తుతం సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అతి త్వరలోనే సినిమా చిత్రీకరణ ముగించి దసరా కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ కు ప్రియుడి పాత్రలో అక్కినేని హీరో సుశాంత్ నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. సుశాంత్ పుట్టిన రోజు సందర్భంగా భోళా శంకర్ యూనిట్ సభ్యులు ప్రత్యేకంగా పోస్టర్ ను విడుదల చేసి శుభాకాంక్షలు తెలియజేయనున్నారట. మరి ఈ సినిమాతో సుశాంత్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.