Akkineni Fans: బాలకృష్ణ క్షమాపణ చెప్పి తీరాలి
Akkineni Fans Fire On Balakrishna: అక్కినేని, నందమూరి కుటుంబాల మధ్య రగిలిన చిచ్చు ఇంకా గట్టిగా రాజుకొంటుంది. నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో అక్కినేని తొక్కినేని అన్న వ్యాఖ్యలపై అక్కినేని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు నర్తకి సెంటర్ వద్ద అక్కినేని అభిమానులు ధర్నా చేపట్టారు. బాలకృష్ణ ఫ్లెక్సీని దగ్దం చేసిన అభిమానులు బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 1984 నుంచే అక్కినేని కుటుంబంపై ఎన్టీఆర్ ఫ్యామిలీ అక్కసు వెళ్లగక్కుతూనే ఉందని, ఇప్పుడు బాలకృష్ణ కూడా దాన్ని బయటపెట్టారని చెప్పుకొచ్చారు.
స్టేజిమీద అందరి ముందు ఆ మాట అన్నందుకు బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పి తీరాలని వారు డిమాండ్ చేశారు. ఇక ఇదే విషయమై నిన్న అక్కినేని వారసులు అఖిల్, నాగ చైతన్య అసహనం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. సోషల్ మీడియా ద్వారా ఒక ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు..” నందమూరి తారక రామారావు , అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు.. తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు.. వారిని అగౌరవపరచటం మనల్ని మనమే కించపరుచుకోవటం” అంటూ చెప్పుకొచ్చారు. మరి ఈ వివాదంపై బాలకృష్ణ ఎలా స్పందిస్తాడో చూడాలి.