Tegimpu: అజిత్ తెగించినా పెద్ద ఉపయోగం లేదంటగా..
Ajith’s Tegimpu Movie Failed To Entertain The Audience: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కు తమిళ్ లో ఎంత పేరు ఉందో తెలుగులో కూడా అంతే పేరు ఉంది. ఆయన సినిమా అక్కడ రిలీజ్ అయిన వెంటనే తెలుగులో కూడా డబ్ అవుతూ ఉంటుంది. ఇక చివరిగా అజిత్ వలిమై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయింది. అందుకు కారణం తెలుగులో మంచి టైటిల్ ను పెట్టకుండా తమిళ్ టైటిల్ నే తెలుగులో పెట్టేశారు. అసలు టైటిలే తెలియకపోతే సినిమా ఏం తెలుస్తోందని అభిమానులు సినిమాకు వెల్ళడం మానేశారు. సరే ఈసారి ఆ తప్పు చేయకూడదని తునీవు సినిమాను తెగింపు పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు థియేటర్ లో రిలీజ్ అయ్యింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కూడా అజిత్ కు నిరాశనే మిగిల్చింది. ఈ ఏడాది సంక్రాంతి సీజన్ లో మొదట రిలీజ్ అవుతున్న సినిమాగా తెగింపు వచ్చింది. అయితే సినిమాకు ఆడియన్స్ నుంచి అనుకున్నంత రెస్పాన్స్ లేదు. కథ కొత్తగా ఉన్నా డైరెక్టర్ తీసిన విధానం పేలవంగా ఉందని, కథలో బలమైన సీన్స్ లో ఎమోషన్స్, లాజిక్ మిస్ అయ్యిందని చెప్పుకొస్తున్నారు. దీంతో అజిత్ ఎంత తెగించినా అభిమానులను అలరించలేకపోయాడని చెప్పుకొస్తున్నారు. మరి ముందు ముందు ఈ సినిమా ఏమైనా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుందేమో చూడాలి.