కోలీవుడ్ సెటిల్ అయిన తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్. నటుడు రాజేష్ కుమార్తెగా పరిచయమైనా.. కోలీవుడ్ మంచి పాత్రలు, వరుస అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ గా మారింది.
కోలీవుడ్ సెటిల్ అయిన తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్. నటుడు రాజేష్ కుమార్తెగా పరిచయమైనా.. కోలీవుడ్ మంచి పాత్రలు, వరుస అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక ప్రస్తుతం తెలుగు, తమిళ్ సినిమాలతో బిజీగా ఉన్న ఐశ్వర్య.. తాజాగా ఫర్హానా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో ఐశ్వర్య.. నేషనల్ క్రష్ రష్మికను అవమానించింది అని వార్తలు గుప్పుమన్నాయి. ఒక ఇంటర్వ్యూలో తనకు ఎలాంటి పాత్రలు సెట్ అవుతాయి అన్న ప్రశ్నకు.. పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాత్రకు తాను బాగా సెట్ అవుతాను అని. అది నా అభిప్రాయం అన్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఆ మాటలను కొందరు వేరుగా అర్ధం చేసుకొని పుష్ప సినిమా లో రష్మిక కంటే కూడా తాను బాగా చేసేదాన్ని అంటూ వ్యాఖ్యలు చేసింది అంటూ ఐశ్వర్య రాజేష్ ను టార్గెట్ చేయడం జరిగింది. దీంతో రష్మిక ఫ్యాన్స్ .. ఐశ్వర్యపై దుమ్మెత్తిపోస్తున్నారు. అంత సీన్ ఉందా.. రష్మిక కంటే ఎక్కువ చేస్తావా..? అంటూ ట్రోల్ చేస్తున్నారు.
ఇక ఈ ట్రోల్స్ పై ఐశ్వర్య పీఆర్ టీమ్ స్పందించింది. ఐశ్వర్య రాజేష్.. రష్మికను ఏమి అనలేదని ఆమె రాసిన నోట్ ను పోస్ట్ చేశారు. అందులో.. తాను రష్మికను ఏమి అనలేదని, పుష్ప లోని శ్రీవల్లి పాత్ర తనకు బాగా సెట్ అవుతుందని అన్నాను కానీ.. అంతకుమించి ఎక్కువ అనలేదని చెప్పుకొచ్చింది. ఇక కొందరు కావాలని ఐశ్వర్య రాజేష్ ను టార్గెట్ చేస్తున్నట్లుగా అనిపిస్తుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరి ఈ వివాదం ఎక్కడకు దారితీస్తుందో చూడాలి.