అఖిల్ ‘ఏజెంట్’ వాయిదా..?
అక్కినేని అఖిల్, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం “ఏజెంట్”. ఎకె ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాను ఆగస్ట్ 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం విదితమే. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ రిలీజ్ డేట్ వాయిదా పడినట్లు తెలుస్తోంది.
సినిమా షూటింగ్ లో జాప్యం జరుగుతున్న కారణంగా ఆ రోజున విడుదల అయ్యే ఛాన్స్ లేదని వినికిడి. అంతేకాకుండా ఇప్పటికే ఆగస్ట్ 11న ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’, 12న సమంత ‘యశోద’ చిత్రాలు విడుదల కానున్నాయి. తాజాగా 12వ తేదీన నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ కూడా రిలీజ్ అవుతుందని ఆ చిత్ర నిర్మాత తెలిపారు. వీటితో పోటీ ఎందుకు.. సింగిల్ గా వద్దామని ఆగినట్లు కూడా తెలుస్తోంది. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.