Adipurush: ఆదిపురుష్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
Adipurush Release Date Fix: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటిస్తున్న చిత్రం ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ రావణుడిగా కనిపిస్తున్నాడు. రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ ఎంతటి వివాదాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసంలేదు. టీజర్ బాలేదని, ప్రభాస్ అనవసరంగా ఈ సినిమా ఒప్పుకున్నాడని అభిమానులు గగ్గోలు పెట్టారు. అయితే అభిమానుల అంచనాలను అందుకొనేలా సినిమాలో చాలా మార్పులు చేస్తున్నట్లు మేకర్స్ తెలపడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా మేకర్స్ ఆదిపురుష్ లేటెస్ట్ అప్డేట్ ఇచ్చి అభిమానులకు షాక్ ఇచ్చారు.
అసలు చెప్పాలంటే ఈ సినిమా ఈ సంక్రాంతి బరిలో ఉండాల్సింది. కానీ కొన్ని కారణాల వలన ఆగిపోయింది. ఆ తర్వాత సమ్మర్ కు వస్తుంది అని చెప్పారు మేకర్స్.. అది కూడా వాయిదా పడింది. అసలు ఈ చిత్రం వస్తుందా లేదా అనుమానాలు రేకెత్తుతున్న వేళ మేకర్స్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ ఏడాది జూన్ 16 న ఆదిపురుష్ ప్రేక్షకుల ముందకు రానున్నట్లు తెలిపారు.రాముడి ఘనతను మీకు అందించడానికి మేము ఎల్లప్పుడు సంతోషిస్తాం.. మరో 150 రోజుల్లో ఆదిపురుష్ మీ ముందకు వస్తుంది అని ట్వీట్ చేశారు. ఇక దీంతో అభిమానులు హమ్మయ్య ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఇచ్చేశారు అంటూ సంతోషిస్తున్నారు. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.