Adipurush:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన `ఆది పురుష్`(Adipurush)ను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి.
Adipurush:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన `ఆది పురుష్`(Adipurush)ను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. సినిమా రిలీజ్‌కు రెడీ అవుతున్నా ఇప్పటికీ ఏదో ఒక అంశం `ఆదిపురుష్`ని చుట్టుముడుతూ మేకర్స్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫస్ట్‌లుక్, టీజర్ నుంచి ఈ మైథలాజికల్ డ్రామా విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. టీజర్ రిలీజ్ తరువాత దర్శకుడు ఓం రౌత్‌ను నెటిజన్లు ఓ ఆట ఆడేసుకున్నారు. వీఎఫ్ ఎక్స్ విషయంలో మరీ ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? 3డీ గ్రాఫిక్స్ అంటే ఇలాగేనా ఉండేది అంటూ విరుచుకుపడ్డారు.
రూ.500 వందల కోట్లతో పొందించిన సినిమానా.. లేక యానిమేషన్ మూవీనా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కామెంట్లు చేశారు. దీంతో ఈ విమర్శలకు చెక్ పెట్టాలని మరో రూ.100 కోట్లు వీఎఫ్ ఎక్స్ కోసం ఖర్చు చేశారు. వెరసి ఆదిపురుష్ బడ్జెట్ కాస్త రూ.600 కోట్లకు చేరింది. సినిమా టీజర్‌పై వెల్లువెత్తిన విమర్శలని దృష్టిలో పెట్టుకుని తాజాగా 3డీ ట్రైలర్‌ని విడుదల చేశారు. గ్రాఫిక్స్ హంగులతో విజువల్ వండర్‌గా ట్రైలర్ ఆకట్టుకుంది. ప్రేక్షకులతో పాటు, అభిమానులు కూడా ట్రైలర్‌పై సంతృప్తిని వ్యక్తం చేశారు.
Adipurush (2)
దీంతో మేకర్స్ దృష్టి `ఆదిపురుష్` ఫస్ట్ డే ఓపెనింగ్స్‌పై పడింది. ట్రేడ్ వర్గాలు కూడా దీనిపైనే చర్చించడం మొదలు పెట్టారు. ఇదే ఊపులో సినిమా ఫస్ట్‌డే ఫస్ట్ షోకు రికార్డు స్థాయి ఓపెనింగ్స్‌ని ప్రపంచ వ్యాప్తంగా రాట్టడం ఖాయమని లెక్కలు వేసుకోవడం మొదలైంది. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ సరిగ్గా నెలరోజులు ఉందంటూ మేకర్స్ కొత్త పోస్టర్ని విడుదల చేశారు. ఈ పోస్టర్లో హనుమంతుడు ఆకాశ మార్గాన పయనిస్తుండగా..వీపుపై నిలబడి రావణ లంకని దహించడానికి రఘరాముడిలా ప్రభాస్ విల్లు ఎక్కుపెట్టి బాణం సంధిస్తున్నారు.
ఈచ పోస్టర్ ఇప్పుడు సరికొత్త వివాదానికి తెర లేపింది. ముందు ఈ పోస్టర్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తూ నెట్టింట వైరల్ చేశారు. అయితే ఆ తరువాత నుంచే దీనిపై ట్రోలింగ్ మొదలైంది. తాజా ట్రోలింగ్ కి కారణం ఏంటంటే పోస్టర్లో హానుమంతుడి తల భాగంలో ఎత్తైన కట్టడాలు కనిపించడం. రామాయణ కాలంలో బిల్డింగ్స్ ఏంటీ? వీఎఫ్ ఎక్స్ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు ఇవేనా అంటూ నెటిజన్లు ఆదిపురుష్ టీమ్‌ని మళ్లీ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.
ఇలా తాజా పోస్టర్‌తో మరోసారి `ఆదిపురుష్` నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇంత వరకు రామాయణ గాధ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న భాషల్లో చాలా సినిమాలొచ్చాయి. అందరికి తెలిసిన కథే. చాలా సార్లు చూసిన కథే. మరి `ఆదిపురుష్`లో దర్శకుడు ఓం రౌత్, మేకర్స్ కొత్తగా ఏం చెప్పబోతున్నారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. `ఆదిపురుష్` ఎలా ఉండబోతోంది? ..జూన్ 16న భారీ స్థాయిలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ మూవీ విమర్శలకు తెర తీస్తుందా? లేక సరికొత్త అంశాలతో ప్రేక్షకుల్ని మధురానుభూతికి లోను చేస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.
@omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #Pramod #Vamsi #KrishanKumar @vfxwaala @rajeshnair06 @DevdattaGNage @AjayAtulOnline @manojmuntashir #ShivChanana @neerajkalyan_24 @TSeries @Retrophiles1 @UV_Creations @Offladipurush @AAFilmsIndia pic.twitter.com/G0I9ypGyII
— UV Creations (@UV_Creations) May 16, 2023