ఉప్పెన సినిమా తర్వాత వైష్ణవ్ తేజ్ సరైన హిట్ అందుకున్నదే లేదు. ఇక అలాంటి హిట్ కోసం వైష్ణవ్ చాలా కష్టపడుతున్నాడు.
ఉప్పెన సినిమా తర్వాత వైష్ణవ్ తేజ్ సరైన హిట్ అందుకున్నదే లేదు. ఇక అలాంటి హిట్ కోసం వైష్ణవ్ చాలా కష్టపడుతున్నాడు. ఇక ఈ నేపధ్యంలోనే ఈసారి మాస్ టచ్ తో వచ్చేస్తున్నాడు. ఎన్. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, శ్రీ లీల జంటగా నటిస్తున్న చిత్రం Pvt04. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను టైటిల్ ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు ఇక ఈ చిత్రం పేరు.. ఆదికేశవ అని అనౌన్స్ చేయడంతో పాటు కథను చూచాయాగా చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో వైష్ణవ్..రుద్ర కాళేశ్వర్ రెడ్డి పాత్రలో కనిపిస్తున్నాడు.
ఒక చిన్న గ్రామంలోని గూండాల నుండి క్వారీ చుట్టూ ఉన్న శివాలయాన్ని రక్షించడానికి హీరో వస్తాడు. గుడి పై విలన్స్ చేయి పడకుండా వారిని చితకొట్టడం హైలెట్ అయ్యింది. ఇక అతని పేరు రుద్ర కాళేశ్వర్ రెడ్డి అని చెప్పి.. హీరో పాత్రను ఎలివెట్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఇక జీవి ప్రకాష్ సంగీతం గురించి అస్సలు చెప్పనవసరం లేదు. మళయాళ నటుడు.. జోజు జార్జ్ విలన్ గా నటిస్తుండగా… కోలీవుడ్ నటి అపర్ణా దాస్.. వైష్ణవ్ కు అక్కగా నటిస్తుందని తెలుస్తోంది. ఆదికేశవ అనే పవర్ ఫుల్ టైటిల్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశాడు. ఇక ఈ సినిమాతో మెగా మేనల్లుడు ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.