Mamatha Mohan Das: ఆ వ్యాధితో బాధపడుతున్న సింగర్ కమ్ నటి
Actress Mamta Mohandas Diagnosed Skin Disorder Bolli Vitiligo: టాలీవుడ్ నటి సమంత అరుదైన చర్మ వ్యాధి మయోసైటిస్ తో బాధపడుతున్న విషయం తెల్సిందే. ఇక ఎప్పడైతే ఆమె తన వ్యాధి గురించి బయటపెట్టిందో… మిగతా హీరోయిన్లు సైతం బయటికి వచ్చి తమ సమస్యలను ఏకరువు పెడుతున్నారు. కల్పిక గణేష్, పునర్నవి భూపాలం. నభా నటేష్.. ఇలా ఒకరి తరువాత ఒకరు సమస్యలతో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక తాజాగా మరో హీరోయిన్ కమ్ సింగర్ మమతా మోహన్ దాస్ సైతం తాను చర్మ వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది.
రాఖీ రాఖీ అంటూ ఎన్టీఆర్ సినిమాలో పాట పాడి మెప్పించిన ఈ చిన్నది యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ తోనే అబ్బాయా అంటూ రొమాన్స్ చేసింది.. ఇక గత కొన్ని రోజుల క్రితమే క్యాన్సర్ బారి నుంచి బయటపడిన మమతా.. బొల్లి అనే చర్మవ్యాధితో బాధపడుతుందట.. దీనివలన కలర్ తగ్గిపోతున్నానని చెప్పుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు నువ్వు ఎంతో దైర్యం ఉన్న అమ్మాయివి.. క్యాన్సర్ నే జయించావ్.. ఇవి ఒక లెక్క.. పోరాడు అంటూ ధైర్యం చెప్తున్నారు.