చెప్పవే చిరుగాలి, అమర్ అక్బర్ఆంటోని, చార్మినార్..థాంక్యూ సుబ్బారావు లాంటి చిత్రాల్లో నటించి మెప్పించిన నటి అభిరామి.
చెప్పవే చిరుగాలి, అమర్ అక్బర్ఆంటోని, చార్మినార్..థాంక్యూ సుబ్బారావు లాంటి చిత్రాల్లో నటించి మెప్పించిన నటి అభిరామి. ప్రస్తుతం రీ ఎంట్రీ లో కూడా మంచి సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తున్న అభిరామి మదర్స్ డే రోజున ఒక సెన్సేషనల్ విషయాన్ని పంచుకుంది. 14 ఏళ్లుగా తల్లి కాలేకపోయాను.. అందుకే ఒక బిడ్డను దత్తత తీసుకున్నాను అని చెప్పుకొచ్చింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఆమె.. ప్రముఖ రచయిత పవనన్ మనమడు రాహుల్ పవనన్ ను పెళ్లాడింది. ఇక వారికి పెళ్లి అయ్యి 14 ఏళ్లు అయినా పిల్లలు లేరు. పిల్లల కోసం చాలా గుడులు, గోపురాలు కూడా తిరిగారట. అయినా ప్రయోజనం లేకపోయేసరికి .. తాము ఒక ఆడపిల్లను దత్తత తీసుకున్నట్లు తెలిపింది. ఆమె పేరు కల్కి అని పెట్టినట్లు చెప్పుకొచ్చింది.
ఒక తల్లిగా మదర్స్ డే ను సెలబ్రేట్ చేసుకోవటం చాలా సంతోషంగా ఉందన్న ఆమె.. తన కుమార్తెతో దిగిన ఫోటోలను పోస్టు చేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు.. సూపర్.. మంచి పని చేశారు. మీ కుటుంబం ఈ పాప రాకతో మరింత సంతోషంగా మారింది అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక ప్రస్తుతం అభిరామి..సురేశ్ గోపి ప్రధాన పాత్ర పోషిస్తున్న గరుడన్ మూవీలో కీలక పాత్ర పోషిస్తోంది. తెలుగులో కూడా ఆమె రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తుందంట.. మరి ఏ సినిమాతో ఆమె తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుందో చూడాలి.