Sarath Kumar: సీనియర్ నటుడు శరత్ కుమార్‌కు తీవ్ర అస్వస్థత..
Actor Sarath Kumar Fell Seriously Ill Joined In Hospital: కోలీవుడ్ సీనియర్ నటుడు శరత్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు ఉదయం ఆయన డీహైడ్రేషన్ మరియు డయేరియాతో బాధపడుతుండడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం శరత్ కుమార్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. భార్య రాధిక, కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇప్పటికే హాస్పిటల్ వద్దకు చేరుకున్నట్టు సమాచారం. ఇకపోతే నటుడు శరత్ కూంర్ కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోనూ సుపరిచితుడే. చిరంజీవి తో కలిసి గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించిన శరత్ కుమార్ తెలుగులో మంచి చిత్రాలలో నటించి మెప్పించారు. ఇక ఇటీవలే రిలీజైన పొన్నియిన్ సెల్వన్ లో సైతం ఒక ముఖ్య పాత్రలో నటించి మెప్పించారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.