టాలీవుడ్ లో ఉన్న అతి కొద్ది మంది క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో హీరోలని మించి అందంగా, హ్యాండ్సమ్ గా కనిపిస్తూ ప్రత్యేకతను చాటుకున్న నటుడు శరత్ బాబు.
టాలీవుడ్ లో ఉన్న అతి కొద్ది మంది క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో హీరోలని మించి అందంగా, హ్యాండ్సమ్ గా కనిపిస్తూ ప్రత్యేకతను చాటుకున్న నటుడు శరత్ బాబు. తెలుగు, తమిళ, మలయాళ. కన్నడ భాషల్లో విలక్షణమైన నటుడిగా పేరు తెచ్చుకున్న ఆయన హీరోలకు సరి సమానంగా వెండితెరపై ఆకట్టుకుంటూ ప్రేక్షకులని మెప్పించారు. ఆహార్యం, వాయిస్ తో హీరోలా కనిపించే రూపంతో అందరి మనసులు దోచుకున్నారు. సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఆయన ప్రస్థానాన్ని ప్రారంభించి సరిగ్గా ఐదు దశాబ్దాలు కావస్తోంది. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, స్నేహితుడిగా, విలన్ గా, తండ్రిగా విభిన్నమైన పాత్రల్లో నటించి న శరత్ బాబు ఆల్ రౌండర్ అనిపించుకున్నారు.
పోలీస్ ఆఫీసర్ కావాలనుకుని..
సినిమాల్లోకి వచ్చిన చాలా మంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని చెబుతుంటారు కానీ శరత్ బాబు మాత్రం పోలీస్ ఆఫీసర్ కావాలనుకుని యాక్టర్ అయ్యారట. శరత్ బాబుకు మొదట్లో సినీ నటుడు కావాలనే కోరిక లేదు. ఆయన పోలీస్ ఆఫీస్ కావాలనుకున్నారు. తండ్రి హోటల్ బిజినెస్ చేసేవారు. తనని కూడా అదే బిజినెస్ చూసుకోమనే వారట. కానీ శరత్ బాబుకు మాత్రం పోలీస్ ఆఫీసర్ కావాలనుకునేవారు. కాలేజీ రోజుల్లో ఆయనకు కంటి చూసు దెబ్బతింది. అదే ఆయన పోలీస్ కావాలన్న కలని కలగా మార్చేసింది. శరత్ బాబు తల్లితో అంతా మీ అబ్బాయి బాగున్నాడు. సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా అని చెప్పేవారట. కాలేజీకి వెళ్లినా లెక్చరర్లు కూడా ఇదే మాట.. ఇలా అంతా అనే మాటలు శరత్ బాబు మైండ్ లో నిత్యం తిరుగుతుండేవట. అయితే ఆయన తండ్రి మాత్రం సినిమాల్లోకి వెళ్లడాన్ని తీవ్రంగా వ్యతిరేకించే వారట. కానీ తల్లి మాత్రం శరత్ కు సపోర్ట్ చేసేదట. ఒక రోజు కొత్త వాళ్లు కావాలని ఓ సినిమా సంస్థ చేసిన పేపర్ ప్రకటన చూసి ఆడిషన్ కు వెళ్లి అలా నటుడిగా కెరీర్ మొదలు పెట్టారు.
`రామ రాజ్యం`తో శరత్ బాబుగా..
శరత్ బాబు అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలసకు చెందిన విజయశంకర దీక్షితులు, సుశీలాదేవికు 1951, జూలై 31న శరత్ బాబు జన్మించారు. ఐపీఎస్ ఆఫీసర్ కావాలనుకుని అనుకోకుండా సినీ రంగంవైపు వచ్చారు. విలక్షణ నటుడిగా తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీల్లో ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు. కథానాయకుడిగా కాకుండా ప్రతినాయకుడిగానూ మెప్పించారు. హీరోకు మిత్రుడిగా, హీరోయిన్ కు సోదరుడిగా, తండ్రిగా, కర్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఆయా పాత్రల్లో తనదైన ముద్ర వేశారు. 1973లో `రామరాజ్యం` నటుడిగా ఆయన తొలి చిత్రం. ఇదే సినిమాతో సత్యం బాబు దీక్షితులు .. శరత్ బాబుగా మారిపోయారు. ఆయన పేరుని దర్శకుడు కె.బాబురావు, రామ విజేత ఫిలింస్ అధినేత కె. ప్రభాకర్… శరత్ బాబుగా మార్చేశారు.
తొలి సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన అదే పేరుని కంటిన్యూ చేస్తూ వచ్చారు. కె. బాబు రావు రూపొందించిన `రామ రాజ్యం` తరువాత `కన్నె వయసు` చిత్రంలో నటించారు. ఆ తరువాత సుప్రసిద్ధ దర్శకుడు కె. బాలచందర్ రూపొందించిన `పట్టిన ప్రవేశం` మూవీతో తమిళ ప్రేక్షకుల్ని పలకరించారు. ఢిల్లీ గణేషన్ హీరోగా నటించిన ఈ సినిమా 1977, సెప్టెంబర్ 9న విడుదలైంది. ఈ సినిమాకు అప్పట్లో తమిళ పత్రిక 100 రేటింగ్ కు గానూ 52 ఇచ్చింది.
సౌత్ ఇండియన్ భాషల్లో….
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రంగనాథ్ హీరోగా నటించిన `పంతులమ్మ`, అమెరికా అమ్మాయి వంటి సినిమాల్లో శరత్ కుమార్ నటించారు. ఈ సినిమాలు ఆయనకు తెలుగు, తమిళ భాషల్లో నటుడిగా మంచి గుర్తింపుని తెచ్చి పెట్టాయి. ఇక కె. బాలచందర్ రూపొందించిన `చిలకమ్మ చెప్పింది` సినిమా కూడా రెండు భాషల్లోనూ మంచి విజయాన్ని సాధించడంతో శరత్ బాబుకు తమిళ, తెలుగు భాషల్లో అవకాశాలు పెరగడం మొదలైంది. మరో చరిత్ర , గుప్పెడు మనసు, శృంగార రాముడు, ఇది కథ కాదు, 47 రోజులు, సీతాకోక చిలుక, సితార, అణ్వేషణ, స్వాతిముత్యం, సాగరసంగమం, సంసారం ఒక చదరంగం, క్రిమినల్, అన్నయ్య వంటి పలు సినిమాల్లో నటించారు.
నటుడిగా సౌత్ ఇండియన్ భాషల్లో దాదాపు 220 సినిమాల్లో నటించిన శరత్ బాబు తన కెరీర్ లో బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఎనిమిది నంది పురస్కారాల్ని దక్కించుకున్నారు. ఒక దశలో 1981, 1988, 1989 సంవత్సరాల్లో వరుసగా మూడు నంది పురస్కారాలని సొంతం చేసుకున్నారు. సీతాకోక చిలుక, ఓ భార్య కథ, నీరాజం సినిమాలకు వరుసగా నంది అవార్డుల్ని అందుకున్నారు.
నటి రమాప్రభతో వివాహం..
నటుడిగా నిలదొక్కుకుంటున్న సమయంలోనే నటి రమా ప్రభను 1974లో వివాహం చేసుకున్నారు. పద్నాలుగేళ్ల వైవాహిక జీవితం తరువాత ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో 1978లో విడాకులు తీసుకున్నారు. శరత్ బాబు కంటే రమా ప్రభ నాలుగేళ్లు పెద్ద. అయినా సరే ఇద్దరు ఏరి కోరి మరీ పెళ్లి చేసుకున్నారు. పద్నాలుగేళ్లు కలిసి ఉన్నారు. ఫైనల్ గా 1988లో విడాకులు తీసుకుని విడిపోయారు. ఆసరా కోసం తాను పెళ్లి చేసుకుంటే శరత్ బాబు మాత్రం అవసరం కోసం చేసుకున్నాడని రమా ప్రభ విమర్శలు చేసింది. 1990లో స్నేహ నంబియార్ ని వివాహం చేసుకున్న శరత్ బాబు ఆమె కు కూడా 2011లో విడాకులిచ్చారు.
ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో సుప్రసిద్ద నటులు శివాజీ గణేషన్, తమిళ నాడు దివంగత ముఖ్యమంత్రి, నటి జయలలిత, కేఆర్ విజయ, రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కల్యాణ్ లతో పాటు నేటి తరం హీరోలైన రామ్ చరణ్, సూర్య వంటి తదితర హీరోలతో కలిసి నటించారు. శరత్ బాబు తెలుగులో చివరి సారిగా కనిపించిన మూవీ వకీల్ సాబ్
…