Actor Bandla Ganesh Appeared In Court In Check Bounce Case: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ను చెక్ బౌన్స్ కేసు వదిలేలా కనిపించడం లేదు. పలువురు సినీ ఫైనాన్షియర్స్ వద్ద నుంచి దాదాపు పది కోట్ల రూపాయలు డబ్బు తీసుకొని తిరిగి చెల్లినచడం లేదని, ఆయన ఇచ్చిన చెక్ లన్ని బౌన్స్ అయ్యినట్లు వారు కోర్టులో కేసు వేసిన విషయం తెల్సిందే.
Actor Bandla Ganesh Appeared In Court In Check Bounce Case: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ను చెక్ బౌన్స్ కేసు వదిలేలా కనిపించడం లేదు. పలువురు సినీ ఫైనాన్షియర్స్ వద్ద నుంచి దాదాపు పది కోట్ల రూపాయలు డబ్బు తీసుకొని తిరిగి చెల్లినచడం లేదని, ఆయన ఇచ్చిన చెక్ లన్ని బౌన్స్ అయ్యినట్లు వారు కోర్టులో కేసు వేసిన విషయం తెల్సిందే. గతంలో పలుమార్లు ఈ కేసు కోసం కోర్టు మెట్లెక్కిన గణేష్ నేడు మరోసారి కోర్టుకు వెళ్లినట్లు తెలుస్తోంది.
నేడు చెక్‌బౌన్స్ కేసులో ఆయన ప్రొద్దుటూరు రెండవ అదనపు సివిల్ జడ్జి కోర్టుకు తన న్యాయవాదితో కలిసి వచ్చారు. ఇక కోర్టుకు హాజరైన బండ్ల చేక్ బౌన్సులకు సంభందించి క్లియరెన్స్ కోసం గడువు కోరినట్లు తెలుస్తోంది. ఇక గణేష్ గడువును కోర్టు అనుమంతించిందా..? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ప్రస్తుతం బండ్ల గణేష్ నిర్మాతగా పలు సినిమాలు తీసే ప్రయత్నంలో ఉన్నాడు.