Arjun Sarja: యాక్షన్ కింగ్ అర్జున్ ఇంట తీవ్ర విషాదం..
Actor Arjun Sarja Mother Lakshmidevamma Passed Away: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అర్జున్ తల్లి లక్ష్మీ దేవమ్మ శనివారం ఉదయం మృతి చెందారు. గత కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను బెంగుళూరులోని అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేశారు. చికిత్స పొందుతూనే ఆమె ఈరోజు ఉదయం కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. తల్లి మరణంతో అర్జున్ ఇంట తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
లక్ష్మీ దేవమ్మ మైసూర్ లో స్కూల్ టీచర్ గా పనిచేసారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఆమె పార్థివ దేహాన్ని అర్జున్ ఇంటికి తరలించారు. రేపు ఆమె అంతిమ సంస్కారాలు జరగనున్నట్లు సమాచారం. కాగా లక్ష్మీ దేవమ్మ మృతి పట్ల కన్నడ పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తూ అర్జున్ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. ఇక యాక్షన్ కింగ్ అర్జున్ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే డైరెక్షన్ కూడా చేస్తున్నాడు. అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ నటిస్తున్న చిత్రం ఇటీవలే సెట్స్ మీదకు వెళ్ళింది.