Khushi Kapoor:దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి వంద కోట్ల క్లబ్లో చేరిన తొలి మరాఠీ మూవీ `సైరఠ్`(Sairat). ఈ సినిమాని హిందీలో కరణ్ జోహార్ (Karan Johar)`ధడక్`(Dhadak) పేరుతో రీమేక్ చేస్తూ శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్(Janhvi Kapoor)ని హీరోయిన్గా పరిచయం చేశారు.
Khushi Kapoor:దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి వంద కోట్ల క్లబ్లో చేరిన తొలి మరాఠీ మూవీ `సైరఠ్`(Sairat). ఈ సినిమాని హిందీలో కరణ్ జోహార్ (Karan Johar)`ధడక్`(Dhadak) పేరుతో రీమేక్ చేస్తూ శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్(Janhvi Kapoor)ని హీరోయిన్గా పరిచయం చేశారు. తొలి చిత్రంతో భారీ క్రేజ్‌ని దక్కించుకున్న జాన్వీ ఆ స్థాయిలో మాత్రం అవకాశాల్ని మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. ఇన్నాళ్లకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ `దేవర` సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇప్పుడు శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ వంతు. ఆమెని కూడా బాలీవుడ్ సినిమాతో పరిచయం చేస్తున్నారు.
అది కూడా తమిళ, తెలుగు భాషల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన రొమాంటిక్ లవ్ స్టోరీ `లవ్ టుడే` రీమేక్‌తో ఖుషీ కపూర్‌ని హీరోయిన్గా పరిచయం చేస్తున్నారు. ఇదే రీమేక్‌తో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్‌ఖాన్ తనయుడు జువైద్ ఖాన్ కూడా హీరోగా పరిచయం కానున్నారు. జాన్వీ తరహాలోనే ఖుషీ కోసం కూడా బ్లాక్ బస్టర్ రీమేక్‌నే నమ్ముకోవడంతో బాలీవుడ్లో ఆమె కెరీర్ ఈ సినిమాతో మలుపు తిరగడం ఖాయం అని శ్రీదేవి అభిమానులు, సినీ విమర్శకులు అంటున్నారు.
ప్రదీప్ రంగనాథన్ నటించి తెరకెక్కించిన మూవీ `లవ్ టుడే`. ఇవన హీరోయిన్గా నటించింది. సత్యరాజ్, రాధిక శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా రూ.వంద కోట్లకు మించి వసూళ్లని రాబట్టి ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురి చేసింది. కంటెంట్ ఉన్న సినిమాలకు స్టార్స్‌తో సంబంధం లేకుండా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని మరోసారి నిరూపించింది. ఇప్పుడు ఇదే సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు.
`లాల్ సింగ్ చడ్డా` ఫేమ్ అద్వైత్ చందన్ ఈ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో రీమేక్ అవుతున్న ఈ మూవీ ద్వారా ఇద్దరు బాలీవుడ్ క్రేజీ స్టార్స్ కిడ్స్ బాలీవుడ్ కు పరిచయం అవుతుండటం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఖుషీ కూపూర్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ కోసం షారుక్ ఖాన్ కూతురు సుహాన ఖాన్‌తో కలిసి `ది ఆర్చీస్`లో నటించింది. ఇది త్వరలోనే నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఖుషీ కపూర్ తెరంగేట్రంపై నిర్మాత బోనీ కపూర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ `శ్రీదేవి మరణించే సమయానికి ఖుషీకి 16 ఏళ్లు. ఆమె ఇండస్ట్రీలోకి వస్తుందని, సినిమాల్లో నటిస్తుందని నేను, శ్రీదేవి అనుకోలేదు. అయితే మంచి నటిగా పేరు తెచ్చుకోవడమే తన ఆశయమని ఖుషీ తనతో చెప్పిందని బోనీ కపూర్ తెలిపారు.