Aamir Khan: షూటింగ్ లో గాయాలపాలైన లెక్క చేయని స్టార్ హీరో..
Aamir Khan Injured Laal Singh Chaddha Shooting: సాధారణంగా హీరోలు ఒక్కో సినిమాకు వందల కోట్లు పారితోషికాలు తీసుకుంటారని అనుకుంటారు కానీ ఒక సినిమా కోసం హీరో ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు. ఒక సినిమా కోసం తగ్గుతాడు.. మరో సినిమా కోసం బరువు పెరుగుతాడు. అంగ వైకల్యం ఉన్నవారిలా, ఇంకా మగతనం లేనివారిలా కూడా నటించడానికి సిద్దపడుతుంటారు. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే షూటింగ్ సమయంలో డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొని దెబ్బలు తగిలించుకొని కూడా అభిమానుల కోసం రియల్ స్టంట్స్ చేస్తుంటారు. ఆ సమయంలో నొప్పి ఉన్నా తప్పక షూటింగ్ ను పూర్తి చేస్తూ ఉంటారు.
తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ గాయాన్ని కూడా లెక్కచేయకుండా సన్నివేశాన్ని పూర్తి చేశాడట. అమీర్ ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా సినిమాలో నటిస్తున్న విషయం విదితమే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ షూటింగ్ లో ఒక సన్నివేశం కోసం లాంగ్ రన్నింగ్ చేయాల్సి ఉండగా.. ఆ క్రమంలో అతడి కాలికి దెబ్బ తగిలింది. వెంటనే చిత్ర బృందం అమీర్ ను హాస్పిటల్ కు వెళ్లాలి అని చెప్పినా వినిపించుకోకుండా కేవలం పెయిన్ కిల్లర్స్ వేసుకుని తన పరుగు కొనసాగించాడట.అంత నొప్పి తోనూ అమీర్ హావభావాలను మిస్ కాకుండా సీన్ ను కంప్లీట్ చేశాడట. దీంతో అభిమానులు అమీర్ కష్టాన్ని ప్రశంసిస్తున్నారు. ఒక సీన్ కోసం అమీర్ ఎంతగా తాపత్రయపడతాడో అని కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా అమీర్ కు ఎలాంటి విజయాన్ని తెచ్చిపెడుతుందో చూడాలి.