Tollywood: నిర్మాతల సంచలన నిర్ణయం.. ఆగస్టు 1 నుంచి షూటింగ్స్ బంద్..?
A sensational decision by the Tollywood producers’ council: టాలీవుడ్ ఇండస్ట్రీలోని సమస్యలపై ప్రొడ్యూసర్స్ గిల్డ్ నేడు అన్నపూర్ణ స్టూడియోస్ లో భేటీ అయిన విషయం తెల్సిందే. దాదాపు 25 మంది నిర్మాతలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఇప్పటికే భారీ బడ్జెట్ చిత్రాలను 10 వారాల తర్వాతే ఓటీటీ కి ఇవ్వాలని, పరిమిత బడ్జెట్లో తెరకెక్కిన చిత్రాలు 4 వారాల తర్వాత ఓటీటీకి ఇవ్వవచ్చని తెలిపిన నిర్మాత మండలి ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగ్లను నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రూ.6 కోట్లలోపు బడ్జెట్ చిత్రాలపై ఫెడరేషన్తో చర్చించాక తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే కనుక జరిగితే టాలీవుడ్ ఇండస్ట్రీ మరోసారి కుదేలు అవ్వడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. మరి ఈ విషయమై నిర్మాతల మండలి ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటారో చూడాలి.