Sharwanand:టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నారు. యుఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా వర్క్ చేస్తున్న రక్షితారెడ్డి(Rakshitha Reddy)ని శర్వా వివాహం చేసుకోనున్న విషయం తెలిసిందే.
Sharwanand:టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నారు. యుఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా వర్క్ చేస్తున్న రక్షితారెడ్డి(Rakshitha Reddy)ని శర్వా వివాహం చేసుకోనున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి 26న వీరి నిశ్చితార్థం జరిగింది. ఎంగేజ్మెంట్ జరిగి ఐదు నెలలు కావస్తున్నా వివాహం జరగడం లేదని, వీరిరి పెళ్లి క్యాన్సిల్ అయిందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టారు. బుధవారం శర్వానంద్, రక్షితారెడ్డిల పెళ్లికి సంబంధించిన వివరాల్ని వెల్లడించారు.
జూన్ 3న జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో శర్వా, రక్షితల వివాహం అత్యంత వైభవంగా జరగనుంది. రాయల్ వెడ్డింగ్ ని తలపించే స్థాయిలో వివాహ ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు రోజుల పాటు పెళ్లి వేడుకలు భారీ స్థాయిలో జరగనున్నాయి. జూన్ 2న మొహందీ ఫంక్షన్‌ని నిర్వహించనున్నారు. ఆ తరువాత రోజే పెళ్లి కొడుకు ఫంక్షన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే రోజు పెళ్లి జరగనుంది. ఇందు కోసం జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌ని ముస్తాబు చేస్తున్నారు.
శర్వానంద్, రక్షితల పెళ్లి జూన్ 3 రాత్రి 11 గంటలకు ప్రారంభిం కానుంది. ఈ పెళ్లికి భారీ స్థాయిలో టాలీవుడ్ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు పాల్గొననున్నారని, మెగా ఫ్యామిలీ హీరోల్లో అత్యధికం శర్వా పెళ్లికి హాజరు కానున్నారని తెలుస్తోంది. రామ్‌చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్‌లతో పాటు హీరోయిన్లు, ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు జైపూర్‌లో జరగనున్న వివాహ వేడుకలో పాల్గొననున్నారట. రక్షితారెడ్డి ప్రముఖ టీడీపి నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలు.
అంతే కాకుండా తెలంగాణ హైకోర్టు న్యాయవాది అయినటువంటి మధుసూదన్‌రెడ్డి ఆమె తండ్రి. దీంతో శర్వా, రక్షితల వివాహానికి భారీ స్థాయిలో సినీ రాజకీయ వర్గాలు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే వివాహ వేడుక కోసం ఏర్పాట్లు మొదలు పెట్టారట. ఇదిలా ఉంటే హీరో శర్వానంద్ ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఇటీవలే యుఎస్‌లో 40 రోజుల పాటు కీలక షెడ్యూల్ ని పూర్తి చేశారు. పెళ్లి తరువాత తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుంది.