Dimple Hayathi:టాలీవుడ్(Tollywood) హీరోయిన్ డింపుల్ హయాతిపై జూబ్లీహిల్స్ పోలీస్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది.
Dimple Hayathi:టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతిపై జూబ్లీహిల్స్ పోలీస్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని హుడా ఎన్ క్లేవ్‌లోని అపార్ట్మెంట్లో ఉంటున్న డింపుల్ కార్ పార్కింగ్ విషయంలో ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే కారుని ధ్వంసం చేసిందని, కావాలనే పార్కింగ్‌లో ఉన్న ఆయన కారుపై కాలితో తన్నిందని మంగళవారం ఉదయం నుంచి వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో డింపుల్ హయాతిపై జూబ్లీహిల్స్ పోలీస్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.
నా లీగల్ టీమ్ దీనికి బదులిస్తుంది..
ఈ సంఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన డింపుల్ `అధికార దుర్వినియోగంతో తప్పులను కప్పిపుచ్చలేరు. అధికారాన్ని ఉపయోగించడం వల్ల ఏ తప్పు దాగదు` అంటూ ట్వీట్ చేసింది. అంతే కాకుండా మరోసారి తాజా వివాదంపై ఆసక్తికరంగా స్పందించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తనకు అండగా నిలుస్తున్న అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డింపుల్ మాట్లాడుతూ `ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారంలో అభిమానులు నాపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞురాలిని. ఇలాంటి పరిస్థితుల్లో నాకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. అయితే ఈ విషయం గురించి నేను ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దయచేసి సహనంతో ఉండాలని కోరుకుంటున్నా. నా లీగల్ టీమ్ త్వరలోనే దీనికి బదులిస్తుంది` అని తెలిపింది.
డింపుల్ హయాతిపై తప్పుడు కేసు పెట్టారు..
ఈ వ్యవహరంపై డింపుల్ న్యాయవాది పాల్ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ `డింపుల్ హయాతిపై తప్పుడు కేసు పెట్టారు. రోడ్డుమీద ఉండాల్సిన సిమెంట్ బ్రిక్స్ అపార్ట్మెంట్లోకి ఎలా వచ్చాయి?. ఇదే విషయాన్ని రెండు నెలలుగా అడుతున్నాం. డీసీపీ ఆమెనరు వేధించాలనుకున్నారు. డింపుల్‌తో చాలా సార్లు డీసీపీ అమర్యాదగా మాట్లాడారు. అలాగే ఆమె పార్కింగ్ స్థలంలో కోన్స్ పెట్టారు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో ఆమె అసహనానికి గురయ్యారు. దాని వల్లే కోన్స్‌ని తన్నారు.
ఆ సమయంలోనే డీసీపీపై కేసు పెడతానని డింపుల్ అన్నారు. అందుకే ఆమెపైనే కేసు పెట్టారు. డీసీపీ ఆమెను వేధించాలనుకుంటున్నారు. ఆయన తన క్వార్టర్స్‌లో ఉండకుండా ఈ అపార్ట్మెంట్లో ఎందుకున్నారు?..ఆయన ప్రభుత్వ ఆస్తుల్ని దుర్వినయోగం చేస్తున్నారు. నిన్ని ఆయనపై ఫిర్యాదు చేయాలని జూబ్లీహిల్స్ పోలీస్టేషన్‌కు వెళ్లారు. అయితే అక్కడ ఎవరూ ఆమె ఫిర్యాదుని స్వీకరించలేదు. మూడు గంటల పాటు అక్కడే కూర్చోబెట్టారు. మేము దీనిపై న్యాయపరంగా పోరాటం చేస్తున్నాం` అని తెలిపారు.
జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని హుడా ఎన్క్లేవ్ లో డీసీపీ రాహుల్ హెగ్డే ఉంటున్నారు. అదే అపార్ట్మెంట్లో హీరోయిన్ డింపుల్ హయాతీ, ఆమె స్నేహితుడు డేవిడ్ కూడా నివస్తున్నారు. సెల్లార్లో ఉన్న పార్కింగ్ ప్లేజ్‌లో డీసీపీ అధికారిక వాహనాన్ని డింపుల్ ధ్వంసం చేసినట్టుగా ఆయన డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డింపుల్, డేవిడ్‌లపై జూబ్లీ హిల్స్ పోలీస్టేషన్లో వివిధ సెలక్షన్ ల కింద కేసు నమోదైంది.
ప్రూఫ్ ఇవ్వమనండీ: డింపుల్ హయాతి
తాజా పరిణామాల నేపథ్యంలో డింపుల్ హయాతి ఓ ఆడియోని విడుదల చేసింది. గన్ మెన్లు పెట్టుకొని ఉన్న అంత పెద్ద ఆఫీసర్లను నేనేం చేస్తాను అన్నారు. కేసు కోర్టు వరకు వెళ్లాఇక అన్ని వివరాలు మీరు వెల్లడిస్తానని తెలిపారు. నా మీద తప్పుడు కేసు పెట్టారని, నేను డీసీపీని ఇబ్బంది పెట్టలేదని, పబ్లిక్ ప్రాపర్టీని తీసుకొచ్చి ప్రైవేట్ ప్రాపర్టీలో పెట్టారన్నారు. తన కారు కోసం ట్రాఫిక్ కోన్స్ తెచ్చి పెట్టారు. ట్రాఫక్ కోన్స్ ను ప్రవేట్ అపార్ట్మెంట్లో ఎలా పెడతారు?. నా కారుతో డీసీపీ వాహానాన్ని ఢీ కొట్టలేదు. డీసీపీ కారుకు ఎక్కడైనా ప్రమాదం జరిగిఉండొచ్చు. నా కారుతో ఢీ కొడితే రెండు వైపులా డ్యామేజీ ఉండాలి కదా?.. ఎలా డ్యామేజ్ జరిగిందో ప్రూఫ్ ఇవ్వమనండీ?..ఊరికే ఎందుకు మాటలు.. హీరోయిన్ అంటే ఇలా చేస్తారా?.. నేను తెలుగమ్మాయినే` అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది డింపుల్ హయాతి. ప్రస్తుతం ఆమె మాట్లాడిన ఆడియో క్లిప్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
#heroinepolicecase #DimpleHayathi పై తప్పుడు కేస్ పెట్టారు అంటున్న #డింపుల్ లాయర్
Advocate questions #ips why cement bricks & traffic #triangles came into apartment parking area. ?
Lot of turns & twists in this case against @DimpleHayathi
Truth need to comeout.#18fms #18f pic.twitter.com/sn8nScTAZM— Narayana Pragada (@pragada1) May 23, 2023
Yours lovingly , pic.twitter.com/JWVc3SBVoP
— Dimple Hayathi (@DimpleHayathi) May 23, 2023