మల్లేశం" చిత్రంతో విమర్శకుల ప్రశంసను సైతం అందుకున్న దర్శకుడు రాజ్ రాచకొండ. తెలంగాణ నేపథ్యంలో, అదీ చేనేత మీద వచ్చిన గొప్ప తెలుగు చిత్రాల్లో మల్లేశం ఒకటిగా నిలిచింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక అంతటి విజయవంతమైన సినిమా తరువాత రాజ్ రాచకొండ నుంచి వచ్చిన చిత్రం 8 A.M మెట్రో.
“మల్లేశం” చిత్రంతో విమర్శకుల ప్రశంసను సైతం అందుకున్న దర్శకుడు రాజ్ రాచకొండ. తెలంగాణ నేపథ్యంలో, అదీ చేనేత మీద వచ్చిన గొప్ప తెలుగు చిత్రాల్లో మల్లేశం ఒకటిగా నిలిచింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక అంతటి విజయవంతమైన సినిమా తరువాత రాజ్ రాచకొండ నుంచి వచ్చిన చిత్రం 8 A.M మెట్రో. గుల్షన్ దేవయ్య, సయామీ ఖేర్, కల్పిక గణేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా నేడు రిలీజ్ అయ్యింది. భావావేశం మెండుగా ఉనప్పటికీ… జీవితం చాలా నిర్లిప్తంగా సాగిపోతున్న ఒక మహిళ.. అనుకోకుండా మెట్రోలో ఒక యువకుడూను కలుస్తుంది. ఆ పరిచయం, స్నేహంగా మారుతుంది. వీరి స్నేహం ఎక్కడివరకు వెళ్లి ఆగింది.
ఇక ఈ చిత్రంలోని కవితలను ప్రఖ్యాత గీత రచయిత, ఆస్కార్ పురస్కార గ్రహీత గుల్జార్ రాయడం విశేషం. నేడు ఈ సినిమా కేవలం హిందీలోనే రిలీజ్ అయ్యింది. అక్కడ సినిమా హిట్ అయితే కనుక మిగతా భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తామని మేకర్స్ తెలిపారు. ఇక ఈ సినిమా విజయం సాధిస్తే… హిందీలో రాజ్ రాచకొండకు మరిన్ని అవకాశాలు వస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదు. ఇకపోతే అందుతున్న సమాచారం ప్రకారం సినిమా పాజిటివ్ టాక్ నే అందుకుందని తెలుస్తోంది. మరి ముందు ముందు ఈ సినిమా తెలుగులో డబ్ అవుతుందో లేదో చూడాలి.