National Film Awards 2023:69వ జాతీయ పురస్కారాలను 2021 ఏడాదికి గానూ కేంద్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం ప్రకటించింది. భారతీయ చలన చిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రకటన ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం 2021వ సంవత్సరానికి గానూ అవార్డుల్ని ప్రకటించింది.
National Film Awards 2023:69వ జాతీయ పురస్కారాలను 2021 ఏడాదికి గానూ కేంద్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం ప్రకటించింది. భారతీయ చలన చిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రకటన ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం 2021వ సంవత్సరానికి గానూ అవార్డుల్ని ప్రకటించింది. ఈ అవార్డుల్లో తెలుగు సినిమాలు అత్యధిక శాతం అవార్డుల్ని దక్కించుకున్నాయి. 2021 సంవత్సరానికి గానూ `పుష్ప: ది రైజ్` సినిమాలో నటనకు గానూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అవార్డు వరించింది.
ఉత్తమ నటి అవార్డుకు గానూ ఈ సారి ఇద్దరు హీరోయిన్లు పోటీపడ్డారు. `గంగూబాయి కతియావాడీ`కి గానూ అలియా భట్, `మిమి` సినిమాకు గానూ కృతిసనన్ పోటిపడ్డారు. అయితే ఈ వార్డుకు ఇద్దరు ఎంపిక కావడం విశేషం. సినిమా రంగంలో అత్యుత్తమ నటన కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిఫుణులకు వివిధ కేటగిరీల్లో అవార్డులు దక్కాయి. 31 విభాగాల్లో ఫీచర్ ఫిల్మ్స్‌కి, 24 విభాగాల్లో నాన్ ఫీచర్ ఫిల్మ్స్ కు, 3 విభాగాల్లో రచనా విభాగానికి అవార్డులు వరించాయి.
2021 సంవత్సరానికి గానూ 281 ఫీచర్ ఫిల్మ్‌లు వివిధ విభాగాల్లో జాతీయ అవార్డుల కోసం స్క్రూటినీకి వచ్చినట్లు జ్యూరీ కమిటీ ప్రకటించింది. ఉత్తమ చిత్ర విమర్శకుడు కేటగిరీలో పురుషోత్తమాచార్యులు (తెలుగు)కు అవార్డు దక్కింది. 2021వ సంవల్పరానికి గానూ ఉత్తమ తెలుగు చిత్రంగా `ఉప్పెన` ఎంపికైంది. ఉత్తమ గుజరాతీ చిత్రం `ఛల్లో` (భారత్ నుంచి ఈ సినిమా అధికారికంగా ఆస్కార్‌కు వెళ్లిన విషయం తెలిసిందే). ఉత్తమ కన్నడ చిత్రంగా `777 ఛార్లీ`, ఉత్తమ మలయాళ చిత్రంగా `హోమ్` ఎంపికయ్యామయి.
`ఆర్ ఆర్ ఆర్` ఆరు విభాగాల్లో సత్తా చాటింది
ప్రపంచ యమనికపై తెలుగు వాడి సత్తాని చాటి ఆస్కార్‌ని దక్కించుకున్న `ఆర్ ఆర్ ఆర్` సినిమాకు 69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఆరు అవార్డులు దక్కాయి. ఉత్తమ యాక్షన్ డైరెక్షన్: కింగ్ సాలమన్ (ఆర్ ఆర్ ఆర్), ఉత్తమ కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్ (ఆర్ ఆర్ ఆర్), ఉత్తమ నేపథ్య గాయకుడు: కాలభైరవ (ఆర్ ఆర్ ఆర్ -కొమురం భీముడో), ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం:`ఆర్ ఆర్ ఆర్`(రాజమౌళి), ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: శ్రీనివాస మోహనన్ (ఆర్ ఆర్ ఆర్), అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం: ఆర్ ఆర్ ఆర్..అవార్డులు దక్కాయి.
జాతీయ అవార్డుల విజేతలు వీరే
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్
ఉత్తమ నటి: అలియా భట్, కృతిసనన్
ఉత్తమ చిత్రం: రాకెట్రి ది నంబి ఎఫెక్ట్ (హిందీ)
ఉత్తమ తెలుగు చిత్రం: ఉప్పెన
ఉత్తమ దర్శకుడు: నిఖిల్ మహాజన్ (`గోదావరి` – మరాఠీ)
ఉత్తమ సహాయనటి: పల్లవి జోషీ (`ది కశ్మీర్ ఫైల్స్` – హిందీ)
ఉత్తమ సహాయ నటుడు: పంకజ్ త్రిపాఠి (మిమి -హిందీ)
ఉత్తమ యాక్షన్ డైరెక్షన్: కింగ్ సాలమన్ (ఆర్ ఆర్ ఆర్)
ఉత్తమ కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్ (ఆర్ ఆర్ ఆర్)
ఉత్తమ గీత రచన: చంద్రబోస్ (కొండపొలం)
ఉత్తమ స్క్రీన్ ప్లే: నాయట్టు (మలయాళం)
ఉత్తమ సంభాషణలు, అడప్టెడ్: సంజయ్ లీలా భన్సాలీ (గంగుబాయి కతియావాడీ – హిందీ)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: సర్దార్ ఉద్దమ్ (అవిక్ ముఖోపాధ్యాయ)
ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయ ఘోషల్ (ఇరివిన్ నిజాల్ – మాయావా ఛాయావా)
ఉత్తమ నేపథ్య గాయకుడు: కాలభైరవ (ఆర్ ఆర్ ఆర్ -కొమురం భీముడో)
ఉత్తమ బాల నటుడు: భావిన్ రబారి (ఛల్లో షో – గుజరాతీ)
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం:`ఆర్ ఆర్ ఆర్`(రాజమౌళి)
ఉత్తమ సంగీతం(పాటలు): దేవిశ్రీప్రసాద్ (పుష్ప)
ఉత్తమ సంగీతం (నేపథ్య): ఎం.ఎం. కీరవాణి (ఆర్ ఆర్ ఆర్)
ఉత్తమ మేకప్: ప్రీతిశీల్ సింగ్ డిసౌజా (గంగుబాయి కతియావాడీ – హిందీ)
ఉత్తమ కాస్ట్యూమ్స్:వీర్ కపూర్ (సర్దార్ ఉద్ధమ్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్: సర్దార్ ఉద్ధమ్ (దిమిత్రి మలిచ్, మన్సి ద్రువ్ మొహతా)
ఉత్తమ ఎడిటింగ్: సంజయ్ లీలా భన్సాలీ (గంగుబాయి కతియావాడీ – హిందీ)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: శ్రీనివాస మోహనన్ (ఆర్ ఆర్ ఆర్)
ఉత్తమ ఆడియో గ్రఫీ (సౌండ్ డిజైనింగ్): అనీష్ బసు (చైవిట్టు – మలయాళం)
ఉత్తమ ఆడియో గ్రఫీ (రీ రికార్డింగ్):సినోయ్ జోసెఫ్ (ఝుల్లి డిస్కర్డ్స్ – బెంగాలి)
అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం: ఆర్ ఆర్ ఆర్