మానవ నాగరికతలో మెదట మనిషికి దొరికింది మట్టి ఒక్కటే.
Vasthu Shastra : మానవ నాగరికతలో మెదట మనిషికి దొరికింది మట్టి ఒక్కటే. గృహ నిర్మాణానికి కుండల తయారీకి, గణపతి నవరాత్రుల వంటి వేడుకలకూ మట్టినే వాడటం మనకు తెలుసు. శిలకు – మట్టికి తేడా ఉంది. పైగా గుళ్లలో ప్రతిష్ఠించే విగ్రహం శాశ్వతంగా, ప్రాణప్రదంగా ఉండాలి. అందుకే.. శిల ప్రకృతి ప్రసాదించిన వరమైంది. శిలలు విగ్రహాలుగా ఆకృతి దాల్చాలంటే ఎన్నో పరీక్షలకు లోనవుతాయి. పైగా గుళ్లలో ప్రతిష్ఠించే విగ్రహం శాశ్వతంగా, ప్రాణప్రదంగా ప్రతిష్టించాలి.
అందుకే.. శిల ప్రకృతి ప్రసాదించిన వరమైంది అంటారు. శిలలు విగ్రహాలుగా ఆకృతి దాల్చాలంటే ఎన్నో పరీక్షలకు లోనవుతాయి. బరువు, గట్టిదనం, రంగు, పెళుసుదనం, ఆయుష్షు.. మొదలైనవి పరిశీలించాల్సి ఉంటుంది. శాండ్‌స్టోన్, లైమ్‌స్టోన్, గ్రానైట్, జెమ్‌స్టోన్, మార్బుల్ (పాలరాయి) మొదలైనవి ఎన్నో రకాలు. వీటిలో గ్రానైట్ (నల్లరాయి) చాలా గట్టిగా ఉంటుంది. శిలలన్నీ పర్వతాలనుంచి వచ్చేవే. అంటే.. భూమిలోంచి లభ్యం అయ్యేవే. పర్వత శిఖరాలు దేవతా స్థానాలు. అలా కూడా శిలలకు సంప్రదాయ గౌరవం ఉంది. కాబట్టి, శిలలు ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి.
కృష్ణశిలకు అంత ప్రాచుర్యం ఏమిటి..?
ముఖ్యంగా రాతికి ‘గుణం’ ఉంటుంది. దీనిపైన చక్కని రూపాలు, చాలా సూక్ష్మమైన కనురెప్పలు, కనుబొమలు, ముఖ కవళికలు సజీవంగా ప్రస్ఫుటం చేసే లక్షణం కృష్ణశిలకు వుంటుంది. అందుకే, పాలంపేట రామప్ప గుడిలోని నంది విగ్రహం అంత ప్రాచుర్యం పొందింది. శిల ఏదైనా వాతావరణాన్ని తట్టుకుని నిలబడాలి. కృష్ణశిలకు ఆ శక్తి ఉంది. ప్రధానంగా యంత్రబద్ధంగా, మంత్రబద్ధంగా ఆ శిల ఆవాహన పొంది.. మహాశక్తి రూపంగా నిలబడగలిగే సున్నితత్వం, సూక్ష్మత్వం దాని లక్షణమై.. శాశ్వతమై ఉంటుంది. అందుకు శిల అవసరం అయ్యింది అంటారు పెద్దలు. దక్షిణ భారతమంతా ఎక్కువగా నల్లరాతి శిల్పాలే వాడుతారు. కారణం.. మనవద్ద వాటి లభ్యత ఎక్కువ. ఉత్తర భారతంలో పాలరాయి ఎక్కువగా వాడుతారు. శిల్పాలన్నీ విగ్రహాలకు పనికిరావు. వాటి శబ్దాన్ని బట్టి, గుణాన్ని బట్టి.. స్త్రీలింగ, పుల్లింగ, నపుంసక లింగ శిలలుగా గుర్తింపు పొందుతాయి. శాస్త్రానుసారమే శిలలు విగ్రహాలుగా నిలబడుతాయి.
ఈశాన్యం గదిని బయటి నుంచి వరండాలా వాడుకోవచ్చా?
ఇంటి మూలలు ఇంటిలోకే కలిసి ఉండాలి అంటారు. ఏ మూల అయినా ఇంటికి ప్రధానమే! ఎప్పుడైనా.. దేని ప్రత్యేకత దానికి ఉంటుంది. మీరు ఈశాన్యం గదిని వరండాలాగా బయటికి ఓపెన్ చేసి, దానిలో వచ్చిన వారిని కూర్చోబెట్టి గాజులు అమ్మడానికి ప్లాన్ చేయడం వలన. దానివల్ల ఇంటి ఆయువుపట్టు తెగిపోతుంది అంటారు. ఎంతగొప్ప భవనమైనా ఈశాన్యగది లేకుంటే.. ఇంటి తల ఎగిరిపోయినట్టే . మీ ఇంటి ముందు.. ఇంటి వెడల్పుతో సమానంగా మంచి ఓపెన్ వరండా వేసుకోవాలి. దాన్ని వ్యాపారానికి వాడుకోవడం వలన మంచి జరుగుతుంది అని అర్ధం. ఇంటిని ఎనిమిది దిశలతో చక్కగా నిర్మించుకొని దాని విధులకు దాన్ని అంకితం చేయాలి. ఇల్లు అనేది కనపడని ఒక శక్తి మందిరం. దాని భౌతిక అవయవాలను కట్ చేసి వాడుకోవద్దు. తద్వారా మన శరీరంలో అపసవ్యత చోటు చేసుకుంటుంది. ఈశాన్యం గదిని దుకాణంలా వాడినా, నడకలు ఇంట్లోంచే ఉండాలి.