తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల కొండా కిట కిట లాడుతుంది. వేసవి సెలవులు ముగుస్తుండడంతో భక్తులు తిరులమాలకు పోటెత్తారు కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోగా శిలా తోరణం వరకు యాత్రికులు క్యూలో నిలబడి ఉన్నారు.
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల కొండా కిట కిట లాడుతుంది. వేసవి సెలవులు ముగుస్తుండడంతో భక్తులు తిరులమాలకు పోటెత్తారు కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోగా శిలా తోరణం వరకు యాత్రికులు క్యూలో నిలబడి ఉన్నారు. టోకెన్లు లేని యాత్రికులకు దర్శనానికి 20 గంటల సమయం పడుతుంది.నిన్న స్వామివారిని 79 ,486 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.40, 250 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 3 .72 కోట్ల ఆదాయం సమకూరిందని టీటీడీ అధికారులు తెలిపారు.
టైమ్ స్లాటెడ్ దర్శనం టోకెన్లు లేకుండా క్యూలైన్లలోకి ప్రవేశించే వారికి దర్శనానికి 24గంటలకు పైగానే సమయం పడుతోంది. జమ్మూలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ మహా సంప్రోక్షణకు హాజరు కావాలని టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. క్యాంప్ కార్యాలయంలో వారు ముఖ్యమంత్రిని కలసి మహాసంప్రోక్షణ ఆహ్వాన పత్రిక అందజేశారు. జూన్ 3వ తేదీ నుంచి 8 వ తేదీ వరకు జమ్మూ శ్రీవారి ఆలయంలో మహా సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సీఎం జగన్మోహన్ రెడ్డికి వివరించారు.