శ్రీ వేంకటేశ్వర వారి భక్తులకు శుభార్త తెలిపింది టీటీడీ . స్వామి దర్శనం కోసం నేడు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను నేడు విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు జులై, ఆగస్టు నెలల కోటాకు సంబంధించి దర్శన టికెట్లను ఆన్లైన్ లో అందుబాటులోకి తీసుకురానుంది.
Tirumala: శ్రీ వేంకటేశ్వర వారి భక్తులకు శుభార్త తెలిపింది టీటీడీ . స్వామి దర్శనం కోసం నేడు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను నేడు విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు జులై, ఆగస్టు నెలల కోటాకుసంబంధించి దర్శన టికెట్లను ఆన్లైన్ లో అందుబాటులోకి తీసుకురానుంది. టికెట్లు బుక్ చేసుకోవాలని అనుకునేవారు టీటీడీ వెబ్సైట్ https://tirupatibalaji.ap.gov.in లో దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ప్రతి నెలా 24న, 25న తిరుపతిలో గదుల కోటాను, తిరుమలలో గదుల కోటాను 26న విడుదల చేస్తారు. టీటీడీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం భక్తులు దర్శనం, సేవల టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు తెలిపారు. ఇప్పటికే జూన్ నెలకు సంబంధించి బుక్సింగ్ పూర్తి అయ్యాయని తెలిపింది టీటీడీ.
వేసవి సెలవుల నేపధ్యంలో తిరుమలలో అధిక రద్దీ దృష్ట్యా ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ బ్రేక్ దర్శనాల సిఫార్సు లేఖలను సైతం టిటిడి రద్దు చేసిందీ.. కేవలం ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులు నేరుగా తిరుమలకు వస్తేనే విఐపి బ్రేక్ దర్శనాలు కల్పిస్తామని ప్రకటించింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. 20 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 10 గంటలు సమయం పడుతోంది.