తిరుమల భక్తులకు శుభవార్త త్తెలిపింది టీటీడీ ఈ నెల 24వ తేదీన ఆన్ లైన్ లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేయనుంది.
Tirumala: తిరుమల భక్తులకు శుభవార్త త్తెలిపింది టీటీడీ ఈ నెల 24వ తేదీన ఆన్ లైన్ లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేయనుంది. అలాగే. జులై, ఆగస్టు నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని.. టికెట్లకు అప్లై చేసుకోవాలని టీటీడీ పాలక మండలి సూచించింది. టీటీడీ వెబ్సైట్ https://tirupatibalaji.ap.gov.in లో దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది.
కాగా, తిరుమలలో నిన్న 9 కంపార్ట్మెంట్లలో వేచివున్నరు భక్తులు.. సర్వదర్శనం భక్తులకు దర్శనానికి 30 నుంచి 40 గంటల సమయం పడుతుండడంతో జూన్ 30వ తేదీ వరకు స్వామి వారి సేవలు, వీఐపీ దర్శనాల్లో స్వల్ప మార్పులు చేసింది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు సుప్రభాత సేవకు విచక్షణ కోటాను రద్దు చేసింది. ఫలితంగా మూడు గంటల ఆదా అవుతుందని తెలిపింది. నిన్న శ్రీవారిని 85,297 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామి వారికి హుండీ ఆదాయం 3.71 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.