సోమవారం 62,745 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన మొక్కుల ద్వారా స్వామి వారికి రూ .3.10 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
Tirumala : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతుండటంతో..ఈ రోజు తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులకు అధికారులు ఆంక్షలు విధించడంతో.. కేవలం ముందుగా స్వామి దర్శనానికి స్లాట్స్ బుక్ చేసుకున్నవారే ఎక్కువ మంది వస్తున్నారు.
మరోవైపు స్వామివారి సర్వదర్శనానికి సుమారు 16గంటల సమయం పడుతోంది. SSD / DD టైమ్ స్లాట్ దర్శనానికి 3 నుంచి 5 గంటల సమయం పడుతోంది. అలాగే శ్రీవారి స్పెషల్ దర్శన్ టికెట్ దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇక సోమవారం 62,745 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన మొక్కుల ద్వారా స్వామి వారికి రూ .3.10 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అలాగే ఏడుకొండలవాడికి 29,816 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు చెప్పారు.
మరోవైపు తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతుండటంతో.. సెప్టెంబరు 18 నుంచి 26 వరకు, అక్టోబరు 15 నుంచి 23వరకు అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ, కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ(Unjal Seva), సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. అయితే ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం(Arjita Brahmotsavam) సేవా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులను మాత్రమే నిర్దేశిత వాహనసేవకు అనుమతిస్తారని తెలిపింది. అలాగే నవరాత్రి బ్రహ్మోత్సవాల అంకురార్పణ వల్ల అక్టోబరు 14న సహస్రదీపాలంకార సేవను రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది.