ప్రేమ పేరుతో ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. ఆడ పిల్లల తల్లిదండ్రులు తమ బిడ్డలను బయటకు పంపాలంటేనే జంకే పరిస్థితులు నెలకొంటున్నాయి. రాష్టంలో ఎదో ఒక మూలన ఇటువంటి దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి.
Sangareddy: ప్రేమ పేరుతో ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. ఆడ పిల్లల తల్లిదండ్రులు తమ బిడ్డలను బయటకు పంపాలంటేనే జంకే పరిస్థితులు నెలకొంటున్నాయి. రాష్టంలో ఎదో ఒక మూలన ఇటువంటి దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. డిగ్రీ చదివే విద్యార్థినిపై ప్రేమోన్మాది ప్రవీణ్ బ్లేడుతో హత్యాయత్నం చేశాడు. అయితే, చేతికి స్వల్ప గాయాలతో విద్యార్థిని అఖిల బయట పడింది. ప్రస్తుతం విద్యార్థిని కాలేజీలోనే పరీక్షలు రాస్తోంది. ప్రవీణ్ ప్రేమను అఖిల తిరస్కరించిందనే కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం డిగ్రీ పరీక్షలు జరుగుతున్నాయి. కాలేజీకి వచ్చిన అఖిల తో ప్రవీణ్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా ప్రవీణ్ దాడి చేసాడు. అయితే ఈ దాడిలో స్వల్ప గాయాలతో బయటపడిన అఖిల ప్రస్తుతం కాలేజీలోనే పరీక్షలు రాస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. గతంలోకూడా ఈ ప్రేమోన్మాదుల చేతిలో చాలామంది అమ్మాయిలు బలైనారు..తాజాగా సంగారెడ్డిలో జరిగిన ఘటనపై విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను కాలేజీకి పంపడానికి జంకుతున్నారు. కాగా ఈ సంఘటనపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.