సైబర్ నేరాలు పెరిగిపోతుండటం అందరినీ కలవరపెడుతోంది. హ్యాకర్లు ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలనే టార్గెట్ చేసుకుని భారీ మొత్తంలో డబ్బుల డిమాండ్ చేస్తున్నారు.
Cyber Crime In Hyderabad : సైబర్ (Cyber) నేరాలకు (Crime) అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. టెక్నాలజీ (Technology)ని అడ్డుపెట్టుకుని నేరగాళ్లు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు. పెద్ద పెద్ద సంస్థలనే టార్గెట్ (Target) చేసుకుని హ్యాకింగ్ (Haking)కు పాల్పడుతూ భారీ మొత్తంలో డబ్బులు (Money) డిమాండ్ (Demand) చేస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ తరహా సైబర్ క్రైమ్ రోజు రోజుకూ పెరిగిపోతూనే ఉంది. హైదరాబాద్ (Hyderabad) కేంద్రంగా పలు ఐటి (It) సంస్థ (Company)లను టార్గెట్ (Target) చేసుకున్న నేరగాళ్లు హ్యాకింగ్ కు పాల్పడుతుండటం కలకలం రేపుతోంది.
ఐఐబిపై పంజా
హైదరాబాద్‌లోని ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (IIB) పై సైబర్ నేరగాళ్లు పంజా విసిరారు. దేశవ్యాప్తంగా బీమా (Insurence)వ్యవహారాలు చూసే ఈ సంస్థపై ఏప్రిల్ (April)తొలివారంలో జరిగిన సైబర్ దాడి ఘటన ఈ మధ్య వెలుగులోకి వచ్చింది. అత్యంత సున్నిత సమాచారం భద్రపరిచే కీలక సర్వర్ల నుంచి డేటాను తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. బిట్ కాయిన్ల (Bit Coins)రూపంలో 2.5 లక్షల డాలర్ల మొత్తాన్ని బదిలీ చేస్తేనే డేటా (Data)ను తిరిగి అప్పగిస్తామని బెదిరించారు.
నిపుణుల ప్రయత్నాలతో డేటా రిస్టోర్అదేసమయంలో ఉన్నతాధికారుల ఆదేశంతో సైబర్ నిపుణులు డేటా రీస్టోర్కు ప్రయత్నించారు. కొంత సమయం తర్వాత డేటాను పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకోగలిగారు. అనంతరం సంస్థ రోజూవారీ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు ఏప్రిల్ రెండో వారంలో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
రష్యా హ్యాకర్ల పనేనా…
దేశ వ్యాప్తంగా అలజడి రేపిన ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రష్యా ఐపీ అడ్రస్‌లతో హ్యాకర్లు దాడి చేసినట్లు గుర్తించారు. దాడి చేసింది రష్యన్ హ్యాకర్లేనా అనేది స్పష్టంగా చెప్పలేమన్నారు. ఏదో ప్రాంతానికి సంబంధించిన ఐపీ అడ్రస్‌లను ఉపయోగించి మరో ప్రాంతం నుంచి దాడులు జరిగే అవకాశముందని , దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు.
సమాచారం పోయిందా…?
ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో 2009లో ప్రారంభమైంది. బీమా రంగం సమర్థంగా పనిచేసేలా పర్యవేక్షించడం, పాలసీదారుల ప్రయోజనాలను రక్షించడం దీని ప్రధాన బాధ్యత. ఐఐబీ నివేదికల ఆధారంగానే పాలసీల ప్రీమియం పెంపు, తగ్గింపు నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సంస్థ దగ్గర దేశవ్యాప్తంగా పాలసీదారుల, బీమా సంస్థలకు సంబంధించి అత్యంత రహస్య, సున్నిత సమాచారం ఉంటుంది.
సమాచారం భద్రమేనా?
ఏదైనా సంస్థ కంప్యూటర్ వ్యవస్థలోకి చొరబడి, దాన్ని ఆధీనంలోకి తీసుకుని, డబ్బులు డిమాండు చేయడాన్నే ర్యాన్సమ్వేర్ దాడులు అంటారు. ఇలాంటి దాడులకు పాల్పడేందుకు ప్రపంచవ్యాప్తంగా పెద్దపెద్ద ముఠాలు తయారయ్యాయి. మన దేశంలోని ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలు, బ్యాంకులు తరచూ వీటి బారినపడుతున్నాయి. ఒక సాప్ట్వేర్ కంపెనీనైతే ఏకంగా రూ.300 కోట్లు డిమాండు చేయడం గమనార్హం. సాఫ్ట్వేర్ కంపెనీలు అనేక ఇతర వ్యాపార సంస్థలకు సంబంధించిన కార్యకలాపాలను నిర్వర్తిస్తుంటాయి. ఉదాహరణకు కొన్ని ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను సైతం సాఫ్ట్వేర్ కంపెనీలు నిర్వర్తిస్తుంటాయి. వీటిలో ఆర్థిక, ఆరోగ్య, బీమా, విద్య తదితర ఖాఖలు ఉంటాయి. కంపెనీల సర్వర్లలోకి చొరబడినప్పుడు సైబర్ నేరగాళ్లు ఈ సంస్థల సమాచారాన్నీ తస్కరిస్తున్నారు. దాంతో వాటి యాజమాన్యాలు తాము ఒప్పందం చేసుకున్న సాఫ్ట్వేర్ కంపెనీపై న్యాయపరమైన చర్యలకు దిగుతున్నాయి. అయితే ఒకప్పుడు పెద్దపెద్ద సంస్థలకు మాత్రమే పరిమితమైన ఈ దాడులు క్రమంగా కిందికి విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. వ్యక్తిగత సమాచారం గోప్యత ప్రశ్నార్థకమవుతోంది.
ఔషధ పరిశ్రమలకు ప్రమాదం..
సైబర్ నేరగాళ్లు ఔషధ పరిశ్రమపైనా కన్నేశారు. ఇటీవల ఓ ఔషధ సంస్థ నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ సమాచారాన్ని, ఔషధాల ఫార్ములాలనూ కొట్టేశామని, కంప్యూటర్లను తమ ఆధీనంలో పెట్టుకున్నామని నేరగాళ్లు బెదిరించినట్లు తెలిసింది. అడిగినంత ఇవ్వకుంటే ఔషదాల తయారీ సమయంలో మిశ్రమాలను తారుమారు చేస్తామని భయపెట్టినట్లు సమాచారం. అదే జరిగితే తీవ్ర విపరిణామాలు తలెత్తే ప్రమాదం ఉండటంతో బాధిత సంస్థ మధ్యేమార్గంగా సర్దుబాటు చేసుకుంది. ఈ . హైదరాబాద్‌లోనూ ఔషధ పరిశ్రమలపై ఈ తరహా దాడులు మొదలయ్యాయని తెలిపారు. సైబర్ భద్రతా ప్రమాణాలను ఆధునికీకరించుకోవడమే అన్నింటికీ పరిష్కారమనినిపుణులు సూచిస్తున్నారు.