వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు వద్ద హత్యకు గురైన కోట రాధ కేసు కీలక మలుపు తిరిగింది. రాధ ను ఆమె భర్త మోహన్‌రెడ్డి హత్య చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
Ongole Woman Murder Case: వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు వద్ద హత్యకు గురైన కోట రాధ కేసు కీలక మలుపు తిరిగింది. రాధ ను ఆమె భర్త మోహన్‌రెడ్డి హత్య చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. రాధకు ఆమె చిన్ననాటి స్నేహితుడు కాశిరెడ్డితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భర్త మోహన్‌రెడ్డి పథకం ప్రకారం ఈ దారుణానికి పాల్పడినట్టు విచారణలో తేలింది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు గ్రామానికి చెందిన సుధాకర్‌రెడ్డి, సుబ్బలక్ష్మమ్మ దంపతుల కుమార్తె కోట రాధ . ఈమెకు తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన మోహన్ రెడ్డితో ఆరేళ్ల కిందట వివాహమైంది. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అయితే, రాధ బాల్య స్నేహితుడైన కాశిరెడ్డి వీరి పెళ్లి నాటికే హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. రాధ పొరుగు గ్రామమైన గండ్రోలపల్లెకు చెందిన కాశిరెడ్డి.. ఆమెకు స్కూల్లో, కాలేజీలో క్లాస్మేట్. దీంతో రాధ కుటుంబ స్నేహితుడిగా కాశిరెడ్డి మసిలేవాడు.
బిజినెస్‌కు డబ్బు అవసరమనికాశిరెడ్డి రాధా కి చెప్పాడు. చిన్ననాటి మిత్రుడు అడగడంతో రాధ కాదనలేక ..దంపతులిద్దరూ కలిసి మొత్తం రూ. 80 లక్షలు ఇచ్చారు. తీసుకున్న అప్పును తిరిగి చెల్లించాల్సిందిగా కొంత కాలంగా మోహన్‌రెడ్డి డిమాండ్ చేసారు. దీంతో డబ్బుఇస్తానని చెప్పి రాధకు ఫోన్ వచ్చింది. డబ్బు తీసుకోవడానికి రాధా ఒక్కతే వెళ్ళింది ఆ తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. దీంతో పోలీసులకు రాధా తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేసారు. ఈ సందర్భంగా ఒళ్లుగగుర్పొడిచే అనేక నిజాలు వెలుగు చూస్తున్నట్లు సమాచారం. రాధ తన స్నేహితుడు కాశిరెడ్డికి డబ్బు ఇవ్వడంతోపాటు, ఇతరత్రా కొన్ని విషయాల్లో భార్యాభర్తల మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాధపై భర్త మోహన్‌రెడ్డి అనుమానం పెంచుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పథకం ప్రకారం ఆమెను అంతమొందించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తెలుస్తోంది.
ఈనెల 17 రాత్రి హత్యకు గురైంది. ఈ హత్యలో ప్రధాన అనుమానితుడిగా అప్పు తీసుకున్న రాధ స్నేహితుడు కాశిరెడ్డిగా భావించిన పోలీసులకు దర్యాప్తులో మరోకొత్త కోణం తెలిసింది. రాధను భర్తే కడతేర్చినట్లు ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. రాధను హత్య చేసేందుకు మోహన్‌రెడ్డి పక్కా ప్రణాళిక రచించాడు. హైదరాబాద్‌లోని ఒక ట్రావెల్స్ కారును అద్దెకు తీసుకున్నాడు. అక్కడ రోడ్డుపై చెరకు రసం అమ్మే మహిళ వద్ద ఫోన్ చేసుకొని ఇస్తానని సెల్ తీసుకొన్నాడు. అందులోని సిమ్‌ను తీసి ఆమెకు తిరిగి ఫోన్ ఇచ్చాడు. ఆ సిమ్‌ను తన ఫోన్లో వేసుకొని రాధతో ఆమె స్నేహితుడి కాశిరెడ్డి పేరుతో రెండు రోజులు చాటింగ్ చేశాడు. డబ్బులు పంపిస్తున్నాను కనిగిరికి రమ్మని ఆమెకు మెసేజ్ చేశాడు. దీంతో కనిగిరిలోని పామూరు బస్టాండ్ సెంటర్‌కు వచ్చిన రాధను కొందరు వ్యక్తులు కారులో ఎక్కించుకొని టిడ్కో ఇళ్ల వద్దకు తీసుకెళ్లి హత్య చేశారు. అనంతరం వెలిగండ్ల అడ్డరోడ్డు సమీపంలో ఆమె మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి వెళ్లారు. రాధను హత్య చేసింది ఆమె చిన్ననాటి స్నేహితుడు కాశిరెడ్డి అని అంతా భావించారు. అదేసమయంలో రాధ మృతదేహం పోస్టుమార్టం సమయంలో అమె భర్త మోహన్‌రెడ్డిని పోలీసులు విచారించారు. అయితే ఎలాంటి అనుమానం లేకుండా సమాధానం చెప్పడంతో పాటు ఆమె మృతదేహాన్ని కోదాడ తీసుకెళ్లి అంత్యక్రియలు కూడా చేశారు. భర్త ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు పోస్టుమార్టం అనంతరం లభించిన కీలక ఆధారాలు కూడా రాధ భర్త వైపు పోలీసులను నడిపించింది. దీంతో మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఆర్థిక లావాదేవీల విషయంలో భర్త మాట వినకుండా రాధ తన స్నేహితుడు కాశిరెడ్డికి డబ్బు ఇవ్వడంతోపాటు, ఇతరత్రా కొన్ని విషయాల్లో వారి మధ్య మనస్పర్థలు ఏర్పడినట్లు తెలుస్తోంది. భార్యపై మోహన్‌రెడ్డికి అనుమానం కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాశిరెడ్డితో ఆమెకు సన్నిహిత సంబంధం ఉందంటూ మోహన్‌రెడ్డి తీవ్రంగా అనుమానించాడు. ఎలాగైనా రాధను అంతమొందించి..హత్య కేసులో కాశిరెడ్డిని ఇరికించాలన్నదే మోహన్‌రెడ్డి పథకమని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం.