ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత సాంకేతికంగా అనేక మార్పులు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఏలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా గూగుల్‌లో సెర్చ్ చేసేవారు. సమాచారం కోసం సెర్చ్ బాక్స్‌లో టైప్ చేస్తే దానికి సంబంధించిన లింకులను గూగల్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ లింకుల ఆధారంగా యూజర్ సమాచారాన్ని తెలుసుకుంటాడు.
టెక్నాలజీ వలన ఎంత సౌకర్యం ఉన్నదో అంతటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. సాంకేతికంగా ప్రపంచం ముందుకు వెళ్తున్న తరుణంలో అంతకంటే వేగంగా కొన్ని రకాల శక్తులు సాంకేతికతను వినియోగించుకొని దాడులు చేయడానికి సిద్దమౌతున్నాయి. ఇప్పటికే అనేక మాల్‌వేర్ వైరస్‌లు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లపై దాడులు చేసి డేటాను చౌర్యం చేస్తున్నాయి. డేటాతో పాటుగా అకౌంట్స్ లో ఉన్న సొమ్ములను కూడా దోచేస్తున్నాయి. తాజాగా థాయ్‌లాండ్ మినిస్ట్రీ ఆఫ్ డిజిటల్ ఎకానమీ అండ్ సోసైటీ, నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సంస్థలు మొబైల్ ఫోన్ల భద్రతకు భంగం కలిగించే కొన్ని రకాల యాప్స్ ను గుర్తించాయి.
సాంకేతికంగా ప్రపంచం అభివృద్ది చెందుతున్నది. అత్యాధునిక సాంకేతిక పద్దతులు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అందుబాటులోకి రావడంతో చేస్తున్న పనులు మరింత సులభం అవుతున్నాయి. అయితే, ఇదే అనేక మంది ఉద్యోగాలు కోల్పోయేలా కూడా చేస్తున్నది.
వాట్సాప్ మెసెంజర్ చాట్ ఎప్పటికప్పుడు వినియోగదారులకు అనుగుణంగా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఒకప్పుడు మెసెంజర్ లోని పాత చాట్‌లను చూసుకోవాలంటే తప్పనిసరిగా స్క్రోల్ చేసుకుంటూ వెళ్లాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు ఆ అవసరం లేదు. దీనికోసం మెటా సంస్థ సెర్చ్ బై డేట్ అనే ఆప్షన్‌ను తీసుకొచ్చింది.
గూగుల్ సంస్థ ఇండియా సీసీఐ పాలసీ రూల్స్‌కు విరుద్ధంగా ఆండ్రాయిడ్ పై గుత్తాధిపత్యం చలాయిస్తుండటంతో ఆ సంస్థపై రూ. 1330 కోట్ల రూపాయల జరిమానా, ప్లే స్టోర్ కేసులో రూ. 936 కోట్లు జరిమానా విధించింది. ఈ జరిమానాలో 10 శాతం నాలుగు వారాల్లో చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే, ఈ తీర్పుపై సుప్రంకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా చుక్కెదురైంది. భారతీయ చట్టాలను తప్పనిసరిగా ఫాలో కావాలని, కేసును ఎన్‌సీఎల్‌టీకి బదిలీ చేసింది.
మైక్రోసాఫ్ట్ సంస్థ అందిస్తున్న అనేక సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఎక్స్ బాక్స్, ఔట్ లుక్, మైక్రోసాఫ్ట 365 తదితర సేవల్లో అంతరాయం కలిగిన మాట వాస్తవమేనని, సత్వరమే పరిష్కరించేందుకు ప్రయత్నం జరుగుతోందని మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా ఉంటున్నది. స్మార్ట్ ఫోన్ వినియోగించేవారు డీఫాల్ట్‌గా వాట్సప్‌ను కూడా వినియోగిస్తున్నారు. వినియోగదారులను ఎప్పటికప్పుడు ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నది. ఇందులో భాగంగానే వాట్సప్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఎవరు మనకు కాల్ చేశారో తెలుసుకోవాలంటే ట్రూకాలర్ యాప్‌ను ఓపెన్ చేసుకోవాలి. అయితే, ఇది థర్డ్ పార్టీ యాప్ కావడంతో వ్యక్తిగతంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. దీనికోసమే ట్రాయ్ సంస్థ నేమ్ కాలింగ్ ప్రజెంటేషన్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేమ్ కాలింగ్ ప్రజెంటేషన్‌పై అభిప్రాయాలు తెలియజేయాలని టెలికాం సంస్థలను కోరింది. కాగా, బీఎస్ఎన్ఎల్, ఎయిర్‌టెల్, వోడాఫోన్, జియో వంటి టెలికాం సంస్థలు తమ అభిప్రాయాలను ట్రాయ్‌కు తెలియజేశాయి. ఈ నేమ్ కాలింగ్ ప్రజెంటేషన్‌పై కొన్ని అభిప్రాయాలను తెలియజేశాయి.