ప్రపంచంలో కుబేరుల జాబితా ఎక్కడ దొరుకుతుంది అంటే ఫోర్బ్స్ మ్యాగజైన్‌లో దొరుకుతంది అంటారు. ఫోర్బ్స్ మ్యాగజైన్‌లో ఒకసారి పేరు వచ్చింది అంటే చాలు వారి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది. ప్రస్తుతం యువతరం అత్యంత శక్తివంతంగా పనిచేస్తూ చిన్నవయసులోనే కోట్లకు పడగలెత్తుతున్నారు. అన్ని విభాగాల్లో రాణిస్తున్నవారి పేర్లను ఫోర్బ్స్ పత్రికలో ప్రచురిస్తుంది.
సాధారణంగా వెయిటర్ జాబ్ అంటే అందరికీ చిన్నచూపు ఉంటుంది. సర్వర్‌గా పనిచేస్తున్నాడు అంటే అతనికి వేరే పని ఏది రాదని, ఎందుకు పనికిరాడని, అందుకే హోటల్‌లో పనిచేసుకుంటున్నాడని అంటుంటారు. తప్పు చేయకుండా ఏ పని చేసుకున్నా తప్పులేదు. హోటల్‌ల సర్వర్ పనిచేయడం అన్నింటికంటే చాలా కష్టం. నైపుణ్యం కావాలి, అంతకు మించి ఓర్పు, సహనం ఉండాలి. అప్పుడే విజయం సాధించవచ్చు.
వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ అవార్డులను ప్రధానం చేస్తుంది. కాగా, ఈ ఏడాది మొత్తం 106 అవార్డులను ప్రకటించింది. ఇందులో 91మందికి పద్మ అవార్డులు దక్కగా, ఆరుగురికి పద్మవిభూషణ్, 9 మందికి పద్మభూషణ్ అవార్డులను ప్రకటించారు. ఇక ఈ అవార్డులు పొందిన వారిలో తెలుగువారు 12 మంది ఉండటం విశేషం. ప్రతిఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పద్మ అవార్డులను ప్రకటిస్తారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డుల ప్రధానం జరుగుతుంది.
ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఏడాదిలో మొట్టమొదటి మన్ కీ బాత్ కార్యక్రమంలో అనేక విషయాలను ప్రస్తావించారు. వాటిలో ఎలక్ట్రానిక్ వ్యర్ధాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. భోపాల్ కేంద్రంగా నడుస్తున్న కబాడీవాలా సంస్థను ప్రశంసించారు. కబాడీవాలా సంస్థ టన్నుల కొద్దీ ఎలక్ట్రానిక్ వ్యర్ధాలను సేకరించి రీ సైకిల్ చేస్తున్న విధానం గురించి ప్రధాని మోడీ తెలిపారు. భారతదేశం గ్లోబల్ రీసైక్లింగ్ హబ్ గా మారడానికి ఇటువంటి సేవలు ఎంతో అవసరమని ప్రధాని అన్నారు.
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో పెన్ గంగా నది ఒడ్డున పెన్ గంగ జాతర వైభవంగా జరుగుతుంది. ప్రతి ఏటా అమావాస్యలో జరిగే ఈ ఉత్సవాలకు ఇరు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల ప్రాంతంలో నివసిస్తున్న కేవీ సుబ్బారెడ్డి గురించి కూడా ప్రధాని మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానంగా ప్రస్తావించారు. కార్పోరేట్ ఉద్యోగాన్ని సైతం వదులుకుని మిల్లెట్ల వ్యాపారం ప్రారంభించారని ప్రధాని మోడీ ప్రశంసించారు. మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే పేరు కేవీ సుబ్బారెడ్డికి సరిగ్గా సరిపోతుందని ప్రధాని అన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా జాతరలు నిర్వహిస్తుంటారు.అందులో ఆదివాసులు నిర్వహించే జాతరకు ప్రత్యేకమైన స్తనము ఉంటుంది. దేవుళ్ళ జాతరను జరుపుకోవడం అందరికి తెలుసు కానీ ఇక్కడ యుద్ధవీరులను స్మరిస్తూ జాతరను జరుపుతారు.
మానవ జీవితంలో టీ ఒక భాగమైంది. రోజులో ఒక్కసారైనా ఖచ్చితంగా టీ తాగుతాము. కొందరైతే రోజుకు నాలుగైదు మార్లు టీ తాగుతుంటారు. ఇప్పుడు ఎక్కడ చూసినా మనదేశంలో టీ దుకాణాలు వెలిశాయి. ఒకప్పుడు టీ మాత్రమే తాగేవారు, ఇప్పుడు దానికి అదనంగా స్నాక్స్ రూపంలో సమోసాను రుచి చూస్తున్నారు. సమోసా తిని టీ తాగడం ఒక అలవాటుగా మారింది. ఈ కాంబినేషన్ ఎప్పుడైనా సరే వావ్ అనిపిస్తుంది. కాస్త కారంగా, మరికాస్త రుచిగా ఉండే సమోసా తిని, ఆ తరువాత వేడి వేడి టీ తాగితే ఆ రుచే వేరప్ప అనేస్తాం. ఫుల్ హ్యాపీతో చేయవలసిన పనిని మరింత హుషారుగా చేస్తారు.