ఆళ్లగడ్డలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మాజీమంత్రి భూమా అఖిలప్రియ హౌస్ అరెస్ట్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు నంద్యాలలోని గాంధీ చౌక్ వద్ద ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి అవినీతి, అక్రమాలను ఆధారాలతో సహా బయట పెడతానని మాజీ మంత్రి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో రంగంలో దిగిన పోలీసులు అఖిల ప్రియను హౌస్ అరెస్టు చేశారు. నంద్యాల వెళ్లకుండా ఆళ్ళగడ్డలోనే పోలీసులు గృహనిర్బంధం చేశారు.
దేశంలో నిర్వహించబోయే మొట్ట మొదటి ఫార్ములా ఈ-రేసింగ్ కు హైదరాబాద్ వేదికైంది,దీంతో ప్రపంచ దేశాలు ఇండియా వైపు చూస్తున్నాయి.
నారా లోకేశ్ తలపెట్టిన యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్నది. చిత్తూరు జిల్లా పూతల పట్టు నియోజక వర్గంలో నారా లోకేశ్ పాదయాత్ర ఉద్రిక్తతల మధ్య సాగింది. పాదయాత్రకు పోలీసులు అనుమతించినా, అడుగడుగునా అడ్డంకులు కలిగిస్తున్నారు. ఇందులో భాగంగానే పూతలపట్టు నియోజక వర్గంలోని బంగారుపాళ్యంలో నిర్వహించాల్సిన బహిరంగ సభకు అనుమతి ఇవ్వలేదు.
పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని ఈవెంట్స్‌లో భాగంగా లాంగ్ జంప్, షార్ట్ ఫుట్ నిబంధనలపై కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ శుక్రవారం డీజీపీ ఆఫీస్ ముందు పెట్రోల్ బాటిళ్లతో ఆందోళన చేసారు.
ఎన్నికల కమిషన్ రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ మిషిన్ల పని తీరును పార్టీ నేతలకు ఈసీ వివరించింది. రిమోట్ ఎలక్ట్రానిక్ మిషన్లను వినియోగించడం ద్వారా ఇబ్బందులు వస్తాయని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. అయితే, దీనిపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరిన్ రిజుజు లోక్‌సభలో వివరణ ఇచ్చారు.
టీమిండియా స్టార్ క్రికెటర్ దీపక్ చాహర్ భార్య జయ భరద్వాజ్‌కు హత్య బెదిరింపులు వచ్చాయి.ఇందుకు ఈ విషయమై దీపక్ తండ్రి ఆగ్రా పోలీస్ స్టేషన్‌లోకేసు పెట్టగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.
రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం సమసిపోయేలా కనిపించడం లేదు. పశ్చిమ దేశాలు, యూరోపియన్ దేశాల అండదండలతో ఉక్రెయిన్ రష్యాను ఎదుర్కొనేందుకు సిద్ధమౌతున్నది. అమెరికా, యూరోపియన్ దేశాలు ఇప్పటికే అనేక ఆయుధాలను అందించారు. ఇంకా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా, యూరోపియన్ దేశాలు ప్రకటించాయి.
హిండెన్‌బర్గ్ రిపోర్ట్ తరువాత ఆదానీ గ్రూప్ షేర్లు గణనీయంగా పడిపోయాయి. ప్రపంచంలోనే టాప్ 3 లో ఉన్న గౌతమ్ అదానీ ఇప్పుడు టాప్ 5కి పడిపోయాడు. అదానీ గ్రూప్ కొనుగోలు చేసిన పలు కంపెనీలు ఆర్థికంగా నష్టాల్లో ఉన్నాయని, అప్పులు చేసి కంపెనీలను కొనుగోలు చేశారని, ఆ కంపెనీలు నో ప్రాపిట్ నో గెయిన్ గా ఉండిపోయాయని, ఇలానే కొనసాగితే అదానీ కంపెనీ దివాలా తీస్తుందని ఫలితంగా బ్యాంకులు ఇబ్బందులు ఎదుర్కొంటాయని హిండెన్‌బర్గ్ పేర్కొన్నది.