టీఎస్పీఎస్సీ అంశం రోజుకో మలుపు తిరుగుతున్నది. టీఎస్పీఎస్సీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఆరోపణలపై ఆధారాలు చెప్పాలని చెప్పి నోటీసులు ఇచ్చింది. కాగా, టీఎస్పీఎస్సీ లీకేజీలపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షా పత్రాలు లీకేజీ వ్యవహారం దుమారం రేపుతున్నది. ఇప్పటికే దీనిపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నాయి. పరీక్షలు రాసిన విద్యార్ధులు, నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉగాది సంబరాలు ప్రారంభమయ్యాయి. శోభకృత్‌నామ సంవత్సరానికి తెలుగు ప్రజలు స్వాగతం పలికారు. ఉదయాన్నే తల స్నానం చేసి, ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి పూజలు చేసి అందరికి ఇష్టమైన షడ్రుచులతో ఉగాది పచ్చడిని తయారు చేసి ఇష్టంగా ప్రసాదంగా స్వీకరిస్తారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారిస్తున్నది. ఇప్పటికే ఈ కేసులో రెండు మార్లు కవితను విచారించింది. కాగా, నేడు మూడోసారి కవితను విచారించారు. ఉదయం 11:30 గంటల నుండి సుమారు 8:30 గంటల పాటు విచారించిరు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని సిట్ విచారిస్తునన సంగతి తెలిసిందే. కాగా, విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారని మండిపడుతూ బీజేపీ పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నది.
ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతిభవన్ వద్ద ఈరోజు ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌కు నిరసనగా ప్రగతిభవన్‌ను ముట్టడించేందుకు ఏబీవీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ప్రగతి భవన్ వైపు వచ్చారు.
తెలంగాణ నిరుద్యోగుల జీవితాలను ఆంధ్ర వ్యక్తుల చేతుల్లో పెట్టారని, తెలంగాణ తెచ్చుకుంది ఇందుకోసమేనా అంటూ నిలదీశారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ తెలంగాణ సమాజానికి ఏం చెప్పదలచుకున్నారంటూ మండిపడ్డారు.
టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఇప్పటివరకు అనుమానితులను అరెస్టు చేసి 9 మంది నిందితులను సిట్ విచారిస్తోంది.