ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్భణం కారణంగా ఉద్యోగులు తమ విలువైన ఉద్యోగాలను కోల్పోతున్నారు. ఇప్పటికే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, ట్విట్టర్, మెటా వంటి సంస్థలు ఉద్యోగాలను తొలగిస్తున్నాయి.
భారతదేశంలో డిజిటల్ పేమెంట్ల జోరు రోజు రోజుకు పెరుగుతోంది. కోట్లాది మంది ప్రజలు డిజిటల్ పేమెంట్లకు అలవాటు పడుతున్నారు. దీంతో లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు ఆన్ లైన్ ద్వారా జరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నెలలో ఏకంగా51 లక్షల కోట్ల విలువైన 1050 కోట్ల డిజిటల్ పేమెంట్ ట్రాన్జాక్షన్లు జరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు.
బులియన్ మార్కెట్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 కారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 పెరగడంతో రూ. 53,800 గా ఉండగా..24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 270 పెరగడంతో రూ.58,690కి పెరిగింది. ఇక వెండి ధర కేజీకి రూ.400 పెరగడంతో రూ. 73,100 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ అరుదైన ఘనత సాధించారు. 2023 గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్నారు. కరోనా సమయంలో ఎన్నో ఒత్తిడులను ఎదుర్కొంటూ సమర్ధంగా విధులు నిర్వహించినందుకు, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా నెలకొన్నిద్రవ్యోల్భణం ఒత్తిళ్లు కూడా శక్తికాంత దాస్ సమర్ధంగా ఎదుర్కొన్నారని ఇంటర్నేషన్ రీసెర్చ్ జర్నల్ సెంట్రల్ బ్యాంకింగ్ కొనియాడింది
ఇటీవల కాలంలో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. అనారోగ్య సమస్యలతో పాటు, చికిత్స విధానం భారీగా పెరగడంతో చాలా మంది ఇన్స్యూరెన్స్‌పై ఆధారపడుతున్నారు. ఆసుపత్రిలో జాయిన్ అయిన తరువాత చికిత్స చేయించుకొని ఇన్స్యూరెన్స్ క్లైయిమ్ చేసుకుంటున్నారు. అయితే, క్లెయిమ్ చేసుకునే విషయంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి.
ప్రపంచంలో లేఆఫ్ పర్వం కొనసాగుతోంది. ఆర్థిక మాంద్యం దెబ్బకు ఇప్పటికే లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలు వరసగా లేఆఫ్‌లు ప్రకటిస్తున్నాయి. తాజాగా మెటా సంస్థ మరోమారు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
కరోనా సమయంలో పుత్తడి ధరలు ఆకాశాన్ని తాకాయి. ఆ తరువాత కోలుకోవడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే, ప్రస్తుతం ఆర్థిక మాంద్యం ప్రపంచ దేశాలను ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఆర్థిక మాంద్యం దెబ్బకు ఉద్యోగాలు ఊడిపోతున్నాయి.
సిలికాన్ వ్యాలీ బ్యాంకు దివాళా తీసింది. వందలాది స్టార్టప్ కంపెనీలకు పెట్టుబడులు అందించిన ఆ బ్యాంక్ ప్రస్తుతం నిండా మునిగింది. ఆ ప్రభావం భారతదేశంపై పడిందని ఇక్కడ ఉన్న SVC కూడా దివాళా తీసిందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ పరిణామాలపై SVC యాజమాన్యం స్పందించింది. తమ బ్యాంకుపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని..అవన్నీ పుకార్లేనని స్పష్టం చేసింది.