Zomato: ఫుడ్ అనగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చే యాప్ జొమాటో (Zomato). ఒకప్పుడు ఆకలేస్తే హాటల్ (Hotel) , రెస్టారెంట్లకు (Restaurant) వెళ్లి తినేవాళ్లు. ఇప్పుడు ఇంట్లోనే కూర్చొని ఈ యాప్‌లో ఆర్డర్ (Food order) పెట్టేస్తున్నారు.
Zomato: ఫుడ్ అనగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చే యాప్ జొమాటో (Zomato). ఒకప్పుడు ఆకలేస్తే హాటల్ (Hotel) , రెస్టారెంట్లకు (Restaurant) వెళ్లి తినేవాళ్లు. ఇప్పుడు ఇంట్లోనే కూర్చొని ఈ యాప్‌లో ఆర్డర్ (Food order) పెట్టేస్తున్నారు. క్షణాల్లోనే ఇంటికి తీసుకొచ్చి ఇస్తుండడంతో చాలా మంది ఈ యాప్‌ను యూజ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తుండడంతో తక్కువ సమయంలోనే బాగా పాపులర్ అయింది జొమాటో. ఇటీవలే సొంతంగా యూపీఐ సేవలను (UPI Services) కూడా ప్రారంభించింది.
ఇక ఇప్పుడు మరో కొత్త బిజినెస్‌లోకి అడుగుపెడుతోంది. టెక్నీషియన్, ప్లంబర్‌తో పాటు ఇతర సేవలను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావడానికి జొమాటో సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ సేవలను అర్బన్ కంపెనీ అనే సంస్థ అందిస్తోంది. యాప్‌లో ఆర్డర్ చేస్తే ఇంటికి వచ్చి మనకు కావాల్సిన పనులు చేసి వెళ్తారు. ఇప్పుడు అర్బన్ కంపెనీకి పోటీగా హైపర్‌లోకల్ సర్వీసెస్‌ను ప్రొవైడ్ చేయాలని జొమాటో సన్నాహాలు చేస్తోంది. అతి త్వరలో ఈ సేవలను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొస్తామని ఈ కంపెనీ సీఈవో దీపిందర్ గోయల్ వెల్లడించారు.
తాను కూడా అర్బన్ కంపెనీ బోర్డులో సభ్యుడిగా ఉన్నానని దీపిందర్ గోయల్ తెలిపారు. అయితే జొమాటో కూడా ఈ సేవలను తీసుకొస్తున్నందున ఈ బోర్డు నుంచి తప్పుకునేందుకు ఇదే సరైన సమయని వ్యాఖ్యానించారు. అర్బన్ కంపెనీతో పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.