ట్విట్టర్ సీఈఓ సంచలనం
WORK FROM HOME : కొవిడ్ (Covid)కనిపెట్టిన కొత్త మంత్రం వర్క్‌ఫ్రమ్ హోం (Work From Home). ఈ మధ్య మెల్లగా అంతర్జాతీయ (Inter National) సంస్థ (Organisations)లు సైతం వర్క్ ఫ్రమ్ హోం కాన్సెప్ట్ (Concept)ను ఎత్తేసి అందరినీ ఆఫీసు (Office)లకు రమ్మని చెబుతున్నాయి. చాలా మంది ఉద్యోగులు (Eemplyees) ఆ మాట వినకుండా మొండికేయడంతో చేసేదేమీ లేక చేతులెత్తేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోం కాన్సెప్ట్ పై రకరకాల వాదనలు మొదలయ్యాయి. కొంత మంది అదే బెటర్(Better) అంటుంటే చాలా మంది ఆ వర్కింగ్ విధానం వల్ల ఉపయోగం లేదంటున్నారు.
మస్క్ ఏమన్నారంటే…
ఇదిలా ఉంటే ప్రపంచ కుబేరుడు టెస్లా, ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ (Mucks)వర్క్ ఫ్రం హోం విధానంపై మరోసారి స్పందించారు. వర్క్ ఫ్రం హోం విధానం ప్రొడక్టివిటీకి సంబంధించే కాకుండా నైతికంగా సరైంది కాదని అన్నారు. ఇంటి నుంచి ల్యాప్‌టాప్ (Laptop)తో పని సాగించడంతో పని సామర్థ్యంపై ప్రభావం చూపడమే కాకుండా.. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు పనిచేసే అవకాశం లేని ఫ్యాక్టరీ కార్మికులు, ఇతర ఉద్యోగులకు తప్పుడు సంకేతాలు (Wrong Indications) పంపుతుందని మస్క్ అన్నారు. భవన నిర్మాణ కార్మికులు, ఆహార తయారీదారులు, కార్లు తయారు చేసే వారు, మరమ్మత్తులు చేసే వారు, వస్తువులను తయారు చేసే వారంతా తప్పకుండా పని ప్రదేశాలకు వెళతారని..కానీ టెక్కీలు మాత్రం ఇంకా ఇంచి నుంచే పని చేస్తున్నారని సీఎన్బీకి ఓ ఇంటర్వ్యూలో ఎలన్ మస్క్ పేర్కొన్నారు.
వారానికి 40 గంటలు
టెస్లా ఉద్యోగులు కార్యాలయాల నుంచే పనిచేయాలన్నారు. ఉద్యోగులు వారానికి కనీసంగా 40 గంటలు తగ్గకుండా ఆఫీస్‌లో పనిచేయాలని సూచించారు. కొవిడ్-19 విపత్కర పరిస్థితుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేశారంటే అర్థం ఉంది కానీ.. ప్రస్తుతం కరోనా తగ్గు ముఖం పట్టిన సమయంలో కూడా ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయిండం సరైంది కాదన్నారు. కొందరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల ప్రొడక్టివిటీ ఏమీ తగ్గదు కాబట్టి దీనిని కొనసాగించినా తప్పేమీ కాదంటున్నారని.. కానీ అది సరైంది కాదని ఎలన్ మస్క్ అన్నారు.