SBI Customers: ఎస్బీఐ కస్టమర్ల ఖాతా నుంచి రూ.295 కట్, ఎందుకో తెలుసా?
Why State Bank Deducted Rs 295 from Your Saving Account
స్టేట్ బ్యాంక్ ఇండియా దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో విస్తరించింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బ్యాంకు అవసరాలు తీరుస్తోంది. ఈ బ్యాంకు ఖాతాదారులలో చాలా మంది అకౌంట్ల నుంచి 295 రూపాయలు కట్ అవుతున్నాయి. తిరిగి వారి అకౌంట్లలోకి జమ కావడం లేదు. ఈ విషయమై కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియక బ్యాంకు సేవలపై మండిపడుతున్నారు.
ప్రతి నెలా సకాలంలో ఈఎంఐలు కట్టని వారి అకౌంట్ల నుంచే 295 రూపాయలు కట్ అవుతున్నట్లు తెలుస్తోంది. దీనిక ఓ కారణం ఉందని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. ప్రతి నెలా 5వ తేదీన కట్టాల్సిన ఈఎంఐ కట్టకపోతే కస్టమర్లు కోతకు గురికాకతప్పదని తెలుస్తోంది.
ఈఎంఐల ప్రక్రియ సజావుగా సాగేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా NACH ను ఏర్పాటు చేసింది. నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ బ్యాంక్ అకౌంట్లలో జరిగే ఈఎంఐల ప్రక్రియను చేపడుతోంది. లోన్లు తీసుకునే వారు, ఇతరత్రా ఈఎంఐలు చెల్లించాల్సిన వారు సకాలంలో చెల్లించకపోతే 250 రూపాయల పెనాల్టీ విధిస్తారు. ఈ పెనాల్టీతో పాటు 250 రూపాయలపై 18 శాతం జీఎస్టీ కూడా విధిస్తారు. 250 రూపాయలపై 18 శాతం జీఎస్టీ విధిస్తే 45 రూపాయలు వసూలు అవుతుంది. దీంతో మొత్తం 295 రూపాయలు అకౌంట్ నుంచి పెనాల్టీ కింద కట్ అవుతుంది.