Twitter: 150 కోట్ల ట్విట్టర్ అకౌంట్లు తొలగించనున్న మస్క్
Twitter will soon start freeing the name space of 1.5 billion accounts
ట్విట్టర్‌ను టేకోవర్ చేసిన నాటి నుంచి ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఎవరి ఊహకు అందని విధంగా నిర్ణయాలు ఉంటున్నాయి. తాజాగా అటువంటి నిర్ణయాన్ని ప్రకటించాడు. త్వరలో 150 కోట్ల ట్విట్టర్ అకౌంట్లు తొలగిస్తున్నట్లు మస్క్ ట్వీట్ చేశాడు.
ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి చాలా కాలంగా వాడని వాళ్లు కోట్ల మంది ఉన్నారు. కనీసం లాగిన్ కూడా అవ్వని అకౌంట్లు కోట్లలోనే ఉన్నాయి. కొంత మంది పాస్‌వర్డ్ మరిచిపోయిన కారణంగా కూడా ట్విట్టర్‌కు దూరంగా ఉంటున్నారు. యాక్టివ్‌గా లేని అటువంటి అకౌంట్లను తొలగిస్తున్నట్లు మస్క్ ట్వీట్ చేశాడు. దీనితో పాటు యూజర్ అకౌంట్ స్టేటస్‌ను తెలిపే సాఫ్ట్ వేర్ అప్‌డేట్‌పై కూడా తాము పనిచేస్తున్నామని మస్క్ తెలిపాడు.
These are obvious account deletions with no tweets & no log in for years
— Elon Musk (@elonmusk) December 9, 2022