Gold Rates: బంగారం అంటే ఇష్ట పడని వారు ఎవరంటారు.. మరీ ముఖ్యంగా భారతీయ మహిళలు.. పసిడి అంటే పడి చచ్చిపోతారు. కానీ కొద్దిరోజులుగా బంగారం ధరలు కొండెక్కి కూర్చుంటున్నాయి. రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. ఇవాళ ఉన్న రేటు రేపు ఉండట్లేదు. గత నెలలో 60 వేలు ఉన్న తులం బంగారం ఇప్పుడు 62 వేలకు చేరుకుంది. దీంతో కొనాలనుకున్న వాళ్లు కూడా రేట్లను చూసి వెనుకడుగు వేస్తున్నారు. ఇక వారం రోజులుగా పెరుగుతూ పోతున్న బంగారం ధరలు శనివారం తగ్గుముఖం పట్టాయి. రేట్లు భారీగా తగ్గాయి.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.700 తగ్గి రూ. 56,500కు చేరుకుంది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 760 తగ్గి రూ. 61,640 గా ఉంది. వరంగల్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 700 తగ్గి రూ. 56,500కు చేరింది. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 760 తగ్గి రూ. 61,640గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 700 తగ్గి రూ. 56,500కు చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 760 తగ్గి రూ. 61,640కి చేరుకుంది. అలాగే గుంటూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 700 తగ్గి రూ. 56,500గా ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 760 తగ్గి రూ. 61,640కి చేరుకుంది.
దేశంలో వివిధ నగరాల్లో బంగారం రేట్లు..
దేశరాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 700 తగ్గి రూ. 56,500కు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 760 తగ్గి రూ. 61,790కి చేరింది. చెన్నైలో శనివారం 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 830 తగ్గి రూ. 56,920కి చేరింది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 910 తగ్గి రూ. 61,090గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 700 తగ్గి రూ. 56,500కి చేరింది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 760 తగ్గి రూ. 61,640గా ఉంది.
బంగారం రేట్లు పెరగడానికి కారణం ఇదే..
బంగారం రేట్లు ప్రతిరోజూ పెరగడం, తగ్గడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఈ రేట్లు పెరగడం అనేది అనేక పరిణామాల మీద ఆధారపడి ఉంటుంది. ఇటీవలకాలంలో ధరలు భారీగా పెరగడానికి ముఖ్య కారణం రష్యా, ఉక్రెయిన్ వార్. అలాగే వడ్డీ రేట్లలో మార్పులు, ఇక కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, ద్రవ్యోల్బణం, మార్కెట్లలో కస్టమర్ల నుంచి వస్తున్న డిమాండ్‌ను బట్టి బంగారం ధరలు రోజూ మారతూ ఉంటాయి.