పసిడి రేటు భారీగా దిగి వచ్చింది. వెండి రేటు కూడా పడిపోయింది.
Gold Rates : బంగారం కొనాలని భావించే వారికి ఊరట. పసిడి రేటు భారీగా దిగి వచ్చింది. వెండి రేటు కూడా పడిపోయింది. గోల్డ్, సిల్వర్ ప్రియులకు ఊరట .వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. బంగారం ధర ఏకంగా రూ. 800 మేర దిగివచ్చింది. దీంతో పసిడి రేటు పది గ్రాములకు రూ. 60,220కు పడిపోయింది. 24 క్యారెట్లకు ఇది వర్తిస్తుంది. అలాగే వెండి రేటు కూడా కుప్పకూలింది. సిల్వర్ రేటు 830 మేర దిగి వచ్చింది. దీంతో సిల్వర్ రేటు కేజీకి రూ. 72,570కు తగ్గింది.
బంగారం ధర 1.3 శాతం మేర పడిపోతే.. సిల్వర్ రేటు 1.13 శాతం మేర దిగి వచ్చింది. బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పవచ్చు. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ 2 వేల డాలర్ల కిందకు వచ్చేశాయి. పసిడి రేటు ఏకంగా ఔన్స్‌కు 2020 డాలర్ల వరకు చేరింది. అయితే ఇప్పుడు పసిడి రేటు 1994 డాలర్ల వద్ద కదలాడుతోంది.అందువల్ల బంగారం, వెండి ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవచ్చు.