కొద్దిరోజులుగా పెరగడమే తప్ప తగ్గడం తెలియని ఎల్పీజీ సిలెండర్ ధర(LPG price).. కేంద్రం తాజా నిర్ణయంతో సామాన్యులకు ఊరట నివ్వబోతోంది.
LPG Price : కొద్దిరోజులుగా పెరగడమే తప్ప తగ్గడం తెలియని ఎల్పీజీ సిలెండర్ ధర(LPG price).. కేంద్రం తాజా నిర్ణయంతో సామాన్యులకు ఊరట నివ్వబోతోంది. 5 రాష్ట్రాల ఎన్నికల ముందు ఎల్‌పీజీ సిలెండర్ ధరను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిలెండర్ ధర రూ.200 వరకూ తగ్గించబోతోందని.. రాబోయే 24 గంటల్లో కేంద్ర ప్రభుత్వం దీనిపై కీలక ప్రకటన చేయనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఎల్‌పీజీ సిలెండర్ ధర ప్రస్తుతం రూ.1,100 వరకూ ఉంటోంది. దీనికి రూ. 30 అదనంగా డెలివరీ బాయ్‌కు ఇచ్చుకోవాల్సిన పరిస్థితిలో సామాన్యులు ఉన్నారు.వారికి ఎటువంటి సర్వీస్ చార్జ్‌లు ఇవ్వొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా.. వాళ్లు డిమాండ్‌కు తలొగ్గి.. రూ..20నుంచి రూ.30 వరకూ అదనంగా చెల్లించుకోవాల్సి వస్తోంది.
అయితే కేంద్రం తాజాగా ఎల్‌పీజీ ధరల తగ్గిస్తూ తీసుకోబోతున్న నిర్ణయంతో..బీజేపీకి ఎన్నికలలో ప్లస్ అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంటే త్వరలో జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్ , ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశాలు ఉండొచ్చని చెబుతున్నారు.