టెస్లా కంటే ముందే చాలా అంతర్జాతీయ సంస్థలు ఇండియాలో తమ వ్యాపారాన్ని ప్రారంభించాయి
Tesla in India :అమెరికా(America)-చైనా (Chaina)మధ్య ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు భారత్ (India)కు కలిసొస్తున్నాయి. ఇండియాలో అతిపెద్ద మార్కెట్(Market)పై ఆశలు పెంచుకున్న ప్రపంచ ప్రఖ్యాత సంస్థలన్నీ ఆసక్తి చూపుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా(Population) కలిగిన భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల (Electic Cars) డిమాండ్ (Demand)పెరుగుతోంది. చైనాకు పోటీగా తయారీ రంగంలో ఇండియాను టాప్ ప్లేస్ (Top Place)లో నిలిపేందుకు మోడీ (Modi) ప్రభుత్వం (Government) కూడా సిద్ధంగా ఉంది. దీంతో ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా (Tesla) ఇండియాలో వ్యాపారం (Business) ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
చైనాకు నో అంటున్న ఇండియా
టెస్లా కార్ల తయారీ ప్లాంట్ చైనాలో ఉంది. చైనాలో తయారైన కార్లను ఇక్కడ అమ్మేందుకు ఇండియా నిరాకరిస్తోంది. దీంతో
అత్యధిక జనాభా ఉన్న భారత మార్కెట్‌పై ఆసక్తిగా ఉన్న టెస్లా కంపెనీ భారత్‌లోనే కార్ల తయారీని ప్రారంభించాలని యోచిస్తోంది.
ఈ వ్యూహంలో భాగంగా టెస్లా బృందం ఈ వారం భారత పర్యటనకు వస్తోంది. సీనియర్ టెస్లా ఇంక్. ఎగ్జిక్యూటివ్‌ల బృందం ఈ వారంలో భారతదేశాన్ని సందర్శించి కేంద్ర ప్రభుత్వ అధికారులను కలవడంతో పాటు భారత్ లో ఫ్లాంట్లను ఏర్పాటు చేసేందుకు పీఎంఓ ఆఫీస్ తో సహా ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశమవుతారు.
ఇంతకుముందే
గతంలోనూ ఇటువంటి ప్రయత్నాలు జరిగాయి. అయితే అప్పట్లో టెస్లా భారత్ లో ప్లాంట్ నెలకొల్పేందుకు అంగీకరించలేదు.
దీంతో చైనాలో తయారైన కార్లను ఇక్కడ అమ్మేందుకు అనుమతులను అడిగింది. అయితే భారత్ అందుకు ఒప్పుకోలేదు. భారత్ లో అధిక దిగుమతి పన్నులు, ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని గతంలో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ విమర్శించారు. మస్క్ తన కంపెనీ వాహనాలను విక్రయించడానికి, సర్వీస్ చేయడానికి అనుమతించని ఏ ప్రదేశంలోనూ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయదని గతంలో చెప్పారు. ఇదిలా ఉంటే టెస్లా ప్రొడక్షన్, బిజినెస్ డెవలప్మెంట్ టీమ్ ఎగ్జిక్యూటివ్స్ మరోసారి టెస్లా కార్లపై దిగుమతి సుంకాలను తగ్గించాలని కోరే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.
ఇండియన్ మార్కెట్‌పై ప్రఖ్యాత కంపెనీల ఆసక్తి
వేగంగా అభివృద్ధి చెందిన భారత మార్కెట్లో వ్యాపార విస్తరణ కోసం చాలా కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. టెస్లా ప్రత్యర్థి కంపెనీలైన మెర్సిడెస్ బెంజ్ ఏజీ స్థానికంగా అసెంబుల్ చేసిన కార్లను విక్రయాలకు సిద్ధమైంది. దీంతో పలు విదేశీ కంపెనీలు కూడా ఇండియన్ మార్కెట్ పై కన్నేశాయి.