Stock Markets: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Markets: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిసాయి.అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతలు మార్కెట్లకు అండగా నిలిచాయి. దీంతో పాటు చమురు ధరలు తగ్గడం కూడా మార్కెట్లకు కలిసి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి 462 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 52 వేల 728కి చేరుకుంది. దీంతో పాటు 143 పాయింట్లకు పెరిగిన నిఫ్టీ 15 వేల 699 వద్ద స్థిరపడింది. ఈ రోజు మహీంద్రా అండ్ మహీంద్రా 4.28 శాతాం, ఇండస్ ఇండ్ బ్యాంక్ 2.59 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.58 శాతం, హిందుస్థాన్ యూనిలీవర్ 2.30 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 2.02 శాతం లాభాన్ని అర్జించి బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. మరోవైపు టెక్ మహీంద్రా -1.3 శాతం , ఇన్ఫోసిస్ -0.77 శాతం, హెచ్సీఎల్ టెక్నాలజీస్ -0.50 శాతం, టీసీఎస్ -0.49 శాతం, విప్రో -0.16 శాతం నష్టాన్ని చవి చూశాయి. దీంతో ఈ రోజు ఇవి టాప్ లూజర్స్‌గా నిలిచాయి.
మరోవై మార్కెట్ల ఇతర వివరాలను చూస్తే.. 2023 ఆర్థిక సంవత్సరంలో రుణాల ద్వారా రూ.9,000 కోట్ల సమీకరణకు కెనరా బ్యాంకు బోర్డు ఆమోదం తెలిపింది. దీంతో కంపెనీ షేరు విలువ ఈరోజు 2.23 శాతం పెరిగింది. థామస్ కుక్ షేరు ధర ఈరోజు ఏకంగా 8.50 శాతం పెరిగి రూ.61.25కు స్థిరపడింది.