Stock Markets: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
Stock Market To Update: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతోన్నాయి. సెన్సెక్స్ 179 పాయింట్ల నష్టంతో 54,341 వద్ద, నిఫ్టీ 53 పాయింట్లు క్షీణించి 16,225 వద్దకు కొనసాగుతోన్నాయి. ట్రేడింగ్‌లో ఐటీ, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగ షేర్లు నష్టాల భాట పట్టాయి
దీంతో పాటు హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ టాప్ నిఫ్టీ లూజర్‌గా ఉంది.ఎస్బీఐ లైఫ్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్ కూడా వెనుకబడి ఉన్నాయి. అలాగే దేశంలో అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, ఎల్ అండ్ టి, ఐసిఐసిఐ బ్యాంక్, టైటాన్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ హిందుస్థాన్ యూనిలీవర్ టాప్ లూజర్‌గా ఉన్నాయి. టాటా స్టీల్, ఎంఅండ్ ఎం అల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఎయిర్టెల్, మారుతీ, సన్ ఫార్మా లాభాల్లో ట్రేడవుతున్నాయి.
మరోవైపు దేశీయ కరెన్సీ రూపాయి తొలిసారి డాలరు మారకంలో 80 రూపాయిల స్థాయికి పడిపోయింది. ఈ వారం సెంట్రల్ బ్యాంక్ సమావేశాలపై, ముఖ్యంగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్‌పై ట్రేడర్లు దృష్టి సారించినందున, నేడు తొలిసారిగా రూపాయి డాలర్‌కు 80కి చేరుకుంది. దీంతో మరింత క్షీణత తప్పదనే ఆందోళన నెలకొంది.