భారత స్టాక్ మార్కెట్లపై అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం పడింది. ఆ కారణంగా సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లో కొనసాగుతున్నాయి
Stock Market : అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు మంగళవారం (Tuesday) లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ (Sensex) 116 పాయింట్ల లాభంతో 62,079 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 50 పాయింట్లు లాభపడి 18,365 దగ్గర కొనసాగుతోంది. డాలరు (Doller)తో పోలిస్తే రూపాయి (Rupee) మారకం విలువ రెండు పైసలు పుంజుకుంది.. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫిన్సర్వ్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, విప్రో, ఎన్టీపీసీ, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
ఒక్క కొటాక్ మహీంద్రా బ్యాంక్ షేరు మాత్రమే నష్టాల్లో కొనసాగుతోంది. అమెరికా మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ముగిశాయి. అప్పుల పరిమితి పెంపుపై నెలకొన్న సందిగ్ధత ఇంకా మార్కెట్లను కలవరపెడుతూనే ఉంది. నేడు ఆసియా- పసిఫిక్ సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారెల్ ధర 0.6 శాతం పెరిగింది. విదేశీ మదుపర్లు సోమవారం రూ.923 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ మదుపర్లు రూ.604 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.